ఇంటర్నేషనల్ ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ను 2017  ఇటలీలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అటు క్రికెటర్, ఇటు హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందిన విరాట్ అనుష్క ల అభిమానులు వీరిద్దరి పేర్ల కలయికతో విరుష్క అనే పేరుతో పిలుచుకుంటున్నారు. ఇక ఈ దంపతులు తమకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు.


ఇదిలా ఉంటే గత ఏడాది అనుష్క ప్రెగ్నెంట్ అనే విషయాన్ని తన భర్త విరాట్ కోహ్లీ అభిమానులతో పంచుకున్నాడు. దీంతో సోషల్ మీడియాలో నెటిజనులు బుల్లి విరాట్ కోహ్లీ వస్తున్నాడంటూ  తెగ కామెంట్లను కూడా చేశారు. అంతే కాకుండా అనుష్క ప్రెగ్నెంట్ ఉన్న సమయంలో విరాట్ తనతో దిగిన ఫోటోలు కూడా షేర్ చేశారు. అంతేకాకుండా జనవరిలో బిడ్డను పరిచయం చేస్తామని తెలిపారు.

కాగా జనవరి 11న ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అనుష్క పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో విరాట్, అనుష్క ఆనందానికి అంతులేకుండా  పోయింది. ఇక తన పాప ఫోటోను ఫిబ్రవరి 2న సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ గా మారింది. అంతేకాకుండా తమ పాప కు తమ పేర్లు కలిసేటట్టు వామిక అనే పేరు పెట్టారు. అంతేకాకుండా ఆ పేరుకు అర్థం కనకదుర్గ అని తెలిపారు. కానీ పాప ముఖాన్ని ఇప్పటివరకు పూర్తిగా చూపించలేరు. ఇదిలా ఉంటే అనుష్క డెలివరీ తర్వాత తొలిసారిగా అద్దం ముందు నిల్చుని దిగిన ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. అందులో కొన్ని విషయాలను పంచుకుంది. తన భుజంపై పాపను ఎత్తుకునేందుకు  ఉపయోగించిన వస్త్రాన్ని చూపిస్తూ ఇప్పుడు  అది తన ఫేవరేట్ అంటూ అభిమానులతో పంచుకుంది. కాగా ఈ ఫోటోలను చూసిన నెటిజనులు ప్రసవం తర్వాత అనుష్క ఎంత ఫిట్ గా ఉండడం ఎలా సాధ్యం అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: