తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఏమాయ చేసావే సినిమాతో తెరంగ్రేటం చేసింది ఈ భామ. తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ భామ. అయితే సమంత ఫ్యామిలీ గురించి ఎవరికీ తెలియదు. ఇప్పుడు సమంత ఫ్యామిలీ గురించి తెలుసుకుందామా.

అయితే సమంత అక్కినేని నాన్న వాళ్ల ప్రభు తెలుగు వాళ్లు. వాళ్ల అమ్మ నివెట్ ది మాత్రం కేరళ. కానీ సమంత వాళ్ల ఫ్యామిలీ మాత్రం చెన్నైలో స్థిరపడ్డారు. ఓ రకంగా సమంత పుట్టినిల్లు.. మెట్టినిల్లు రెండు తెలుగు గడ్డే కావడం విశేషం. సమంత వాళ్ల అమ్మా నాన్నలకు జోనాథన్, డేవిడ్ తర్వాత సమంత మూడో సంతానం. కుటుంబంలో ఈమె చిన్నది కావడంతో తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచారు.

ఇక సమంత అక్కినేని బాల్యం, విద్యాభ్యాసం మొత్తం చెన్నైలో జరిగింది. డిగ్రీ చదువుతున్న సమయంలోనే మోడలింగ్ చేసారు సమంత. ఆ టైమ్‌లోనే ప్రముఖ దర్శకుడు రవి వర్మన్ తను తీయబోయే తమిళ సినిమా ‘మాస్కోవిన్ కావేరి’లో హీరోయిన్‌గా ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు. తమిళంలో ఆ సినిమా కంటే ముందు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ఏమాయ చేసావే’ సినిమా విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత సమంత కథానాయికగా వెనుదిరిగి చూసుకోలేదు.

తన కెరీర్ పీక్స్‌లో ఉండగానే తోటి హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా హీరోయిన్‌గా కెరీర్‌ను కూడా కంటిన్యూ చేసింది. సమంత ‘ది ఫ్యామిలీ మెన్ 2’ వెబ్ సిరీస్‌ తో పాటు సాకీ పేరుతో దుస్తుల బ్రాండ్‌ను స్టార్ట్ చేసింది. దాంతో పాటు ‘ఆహా’లో సామ్ జామ్ అంటూ యాంకర్ అవతారం కూడా ఎత్తింది.  అంతేకాదు స్నేహితులతో కలిసి ఓ స్కూల్‌ను కూడా స్టార్ట్ చేసింది. ప్రస్తుతం సమంత అక్కినేని ’శాకుంతలం’ అనే పౌరాణికం సినిమా చేస్తోంది. గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: