సాధారణంగా గర్భంతో ఉన్నవారు ఎక్కువగా ఏ పని చేయరు. చాలా వరకు విశ్రాంతి తీసుకుంటారు. నెలలు నిండే వరకు ఎక్కడికి వెళ్ళకుండా డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ వాడుతూ, చిన్న చిన్న వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. ఏదైనా పని చేయాలి అంటే డాక్టర్ను సంప్రదిస్తారు. అలాంటిదే నిండు గర్భంతో ఉన్న హీరోయిన్ డాన్స్ చేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో నో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఈ వీడియోని త్వరలో డిలీట్ చేయవచ్చని ఆ లోపు అందరూ చూడండి అని పోస్ట్ చేశారు. ఈ విషయం గురించి మనం తెలుసుకుందాం.


 గర్భంతో ఉన్నవారు ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటారు. డాక్టర్ల సలహా మేరకు చిన్నచిన్న వర్కౌట్స్ చేస్తారు. ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తారు. ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటూ కడుపులో ఉన్న బేబీ కదలికను ఎంజాయ్ చేస్తూ, తల్లి యొక్క మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ నటి మోడల్ లీసా హెడెన్ కూడా ఇదే చేస్తోంది. ఇప్పటి వరకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ బ్యూటీ మూడో బిడ్డకు జన్మనివ్వ బోతోంది.


 అయితే గర్భంతో ఉన్న కూడా తన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ తో కలిసి లీసా హెడెన్ ఇటీవల డాన్స్ చేసి సందడి చేసింది. ముగ్గురు కలిసి నడుమును తిప్పుతూ డ్యాన్స్ అదరగొట్టారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది లీసా హెడెన్. ఈ వీడియోని త్వరలో డిలీట్ చేయవచ్చు అని ఆ లోపు అందరూ చూసేయండి అని లీసా హెడెన్ పోస్ట్ చేసింది. తన ఫ్రెండ్ ఇసబెల్లా శ్రీమంతం సందర్భంగా వీరిద్దరితో పాటు మరో గర్భిణీ కూడా డాన్స్ చేశారు. బేబీ షవర్ రోజున అందరిలా కేకులు ఇవ్వకుండా ఇలా డ్యాన్స్ తో సెలబ్రేట్ చేసుకున్నందుకు సంతోషంగా ఉందని ఇంస్టాగ్రామ్ లో పేర్కొంది లీసా హెడెన్.


 2010లో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన హీరోయిన్ ఇప్పటివరకూ 8 చిత్రాల్లో నటించింది. చివరగా 2016లో ఏ దిల్ హై ముష్కిల్ సినిమా లో మురిసింది. తెలుగులో రామ్ చరణ్ సరసన రచ్చ మూవీ లో రచ్చ రచ్చ చేసింది లిసా హెడేన్. పలు రియాల్టీ షోలకు జడ్జిగా కూడా ఆమె వ్యవహరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: