నంది అవార్డు అనగానే అది ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డు అని ప్రతి ఒక్కరూ  భావిస్తుంటారు. సాధారణంగా ఎంతో సాహసం చేస్తేనే..  ఎటువంటి వారికైనా ఈ నంది అవార్డు వరిస్తుంది..సాధారణంగా ఒక మనిషి ఒక సారి నంది అవార్డును పొందడం అంటే అది అతిశయోక్తి కాదు. కానీ ఇక్కడ మన తెలుగు సినీ ఇండస్ట్రీలో మాత్రం చాలా మంది హీరోలు,సుమారు నాలుగు సార్లకు పైగానే నంది అవార్డులను అందుకున్నారు. అయితే ఎవరెవరు ఎన్ని సార్లు నంది అవార్డులను అందుకున్నారు..? అందులో మొదటి సారిగా నంది అవార్డును అందుకున్న వ్యక్తి ఎవరో..?ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


ఈ నంది అవార్డు విభాగంలో భాగంగా బెస్ట్ యాక్టర్ అవార్డును 1977లో ప్రవేశపెట్టగా.. ఇక అప్పటి నుంచి దాదాపు నలభై సంవత్సరాలుగా ఈ నంది అవార్డును ఇవ్వడం విశేషం.. అయితే ప్రస్తుతం ఈ నంది అవార్డు ఇవ్వడంలో సందిగ్ధాలు నెలకొనడంతో 2017 తర్వాత ఈ అవార్డును పెండింగ్లో ఉంచారు.. 1997లో మొట్టమొదటిసారిగా కృష్ణంరాజు "అమరదీపం" చిత్రానికిగానూ నంది అవార్డును అందుకున్నాడు.. ఇక 2016 సంవత్సరంలో నాన్నకు ప్రేమతో చిత్రానికి గాను జూనియర్ ఎన్టీఆర్ నంది అవార్డు ను అందుకోవడం విశేషం..


తెలుగు సినీ ఇండస్ట్రీ లో ఎక్కువ సార్లు నంది అవార్డులను గెలుచుకున్న వారిలో మొట్టమొదటి వ్యక్తి విక్టరీ  వెంకటేష్. ఈయన నటించిన ప్రేమ, ధర్మచక్రం, గణేష్ ,  కలిసుందాం రా, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే వంటి చిత్రాలకు గాను విక్టరీ వెంకటేష్ కు ఎన్నో సార్లు నంది అవార్డులు లభించాయి . ఇక మహేష్ బాబు నాలుగు సార్లు నంది అవార్డును అందుకున్నాడు. అందులో మహేష్ బాబు నటించిన చిత్రాలు  దూకుడు, నిజం, అతడు, శ్రీమంతుడు చిత్రాలకు గానూ నంది అవార్డు లభించింది.

ఇక చిరంజీవి మూడుసార్లు నంది అవార్డును అందుకున్నాడు. ఈయన నటించిన చిత్రాలు ఇంద్ర, ఆపద్బాంధవుడు, స్వయంకృషి చిత్రాలకు గాను నంది అవార్డులు లభించాయి.  ఇక బాలకృష్ణ కూడా మూడు సార్లు నంది అవార్డులను అందుకున్నాడు. సింహా, లెజెండ్,నరసింహనాయుడు చిత్రాలకు బాలకృష్ణ కు నంది అవార్డు లభించింది. అలాగే జగపతి బాబుకు మూడు సార్లు, కమల్ హాసన్ కు మూడు సార్లు, నాగార్జున కు మూడు సార్లు, అక్కినేని నాగేశ్వరరావు కు రెండుసార్లు ఇలా మరికొంత మంది హీరోలకు నంది అవార్డు లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: