సినీ పరిశ్రమలో ఒకప్పుడు బాగా పాపులర్ అయిన వాళ్లంతా ఇప్పుడు ఒక్క ఛాన్స్ అంటూ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.. కొత్త వాళ్ళు వచ్చే కొద్ది పాతవాల్లని దూరం పెడుతున్నారు అనేది వాస్తవం. ఇప్పుడు చూస్తున్నా పరిస్థితులు అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. విషయానికి వస్తే.. ప్రముఖ హాస్య నటుడు వడివేలు.. ఈ పేరు అందరికీ తెలిసిందే..ఎన్నో సినిమాలలో నటించి హాస్య కిరీటి గా పేరు తెచ్చుకున్నాడు. ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. గత దశాబ్దకాలంగా సినిమాలకు దూరంగా వుంటున్నారు. ఇందుకు కారణం.. గతంలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే. అప్పటి నుంచి వడివేలు కోలీవుడ్‌ వెండితెరకు దూరమయ్యారు.


అయినప్పటికీ వడివేలుకు ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఏమాత్రం తగ్గలేదు. పైగా సోషల్‌ మీడియాలో వడివేలు హాస్యనటనకు సంబంధించిన ఫోటోలే మీమ్స్‌ సృష్టికర్తల ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌గా ఉన్నాయి. అందుకే వడివేలు ఫోటోలు ఎల్లవేళలా సోషల్‌ మీడియాలో కనిపిస్తుంటాయి.ఈ నేపథ్యంలో ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న వడివేలు మాట్లాడుతూ, తాను నటనకు దూరమై పదేళ్ళు గడిచిపోయాయని, అయినా సినిమాల్లో నటించే ఉత్సుకత, హాస్యాన్ని పండించే శక్తియుక్తులు తనలో ఏమాత్రం తగ్గిపోలేదని, ఏ ఒక్కరూ అవకాశం ఇవ్వడం లేదంటూ వాపోయారు..


ఇది ఇలా ఉండగా.. వివాదాస్పద నటిగా గుర్తింపు పొందిన మీరా మిథున్‌ కూడా వడివేలు పట్ల సానుభూతి వ్యక్తం చేసింది. వడివేలు వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయన్నారు. 'త్వరలోనే నేను ఒక సినిమాను నిర్మించబోతున్నా. అందులో వడివేలుకు అవకాశం ఇస్తాను. ఆయన నటించాలని భావిస్తే తప్పకుండా ఆ చిత్రంలో నటించవచ్చు' అని పేర్కొంది. జీవితంలో సక్సెస్‌ఫుల్‌గా ఉన్నవారిని మోసంతోనూ, వంచనతోనూ తొక్కేస్తుంటారు. నిజానికి, ఒక వ్యక్తిని మరో వ్యక్తి తోక్కివేయలేరు. వడివేలు లాంటివారు మహా నటులు కన్నీరు కార్చకూడదు అంటూ మీరా మిథున్‌ ఓదార్పు వచనాలు పలికింది. మీరా మిథున్‌ కూడా గతంలో స్టార్‌ హీరోలపై కొన్ని వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే... అవి కూడా దుమారం రేపాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: