గతంలో బాలీవుడ్ టాప్ హీరో అమీర్ ఖాన్ ను ఇంటర్ నేషనల్ సెలెబ్రెటీ గా మార్చిన కార్యక్రమం ‘సత్యమేవ జయతే’ ఒక ప్రముఖ హిందీ ఛానల్ లో ప్రసారం అయిన ఆనాటి షో అమీర్ ఖాన్ పేరును విపరీతంగా పెంచడమే కాకుండా అతడి గురించి టైమ్ మ్యాగజైన్ ముఖ చిత్రం వేసి అతడి పై ఒక కథనం వ్రాసేలా ‘సత్యమేవ జయతే’ కార్యక్రమం అమీర్ ఖాన్ ఖ్యాతిని పెంచింది.


అప్పట్లో పవన్ కళ్యాణ్ తో ఈ ‘సత్యమేవ జయతే’ కార్యక్రమాన్ని తెలుగులో కూడ ప్రసారం చేయాలని ఒక ప్రముఖ ఛానల్ ప్రయత్నాలు చేసినప్పటికీ అప్పట్లో పవన్ స్పందించలేదు అని అంటారు. అయితే ఆ ‘సత్యమేవ జయతే’ పవన్ ను విడిచి పెట్టలేదు. తెలుస్తున్న సమాచారం మేరకు ‘వకీల్ సాబ్’ లో ‘సత్యమేవ జయతే’ అన్న పల్లవితో ఒక పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ఉన్నట్లు తెలుస్తోంది.


ఈ పాటకు తమన్ అద్భుతమైన మ్యూజిక్ ట్యూన్ అందించాడని వార్తలు వినిపిస్తున్నాయి. ‘వకీల్ సాబ్’ మూవీ పై మరింత మ్యానియా పెంచడానికి ఈ పాటను త్వరలో విడుదల చేస్తారని లీకులు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ‘మగువా మగువా’ సాంగ్ విపరీతంగా పాపులర్ అయిన నేపధ్యంలో ఈ పాటకు మించిన ట్యూన్ ఈ ‘సత్యమేవ జయతే’ సాంగ్ ట్యూన్ కు ఉంటుంది అని అంటున్నారు.


వాస్తవానికి ఈ మూవీకి ‘సత్యమేవ జయతే’ అన్న టైటిల్ ఫిక్స్ చేయాలని భావించినప్పటికీ ‘వకీల్ సాబ్’ అన్న టైటిల్ కు అందరు కనెక్ట్ అవుతారు అన్న ఉద్దేశ్యంతో ఈ మూవీ టైటిల్ ను అనేక ఆలోచనలు చేసి చివరికి ‘వకీల్ సాబ్’ గా మార్చారు. ఏప్రియల్ నెలలో రాబోతున్న ఉగాది ని టార్గెట్ చేస్తూ ఏప్రియల్ 9న విడుదల కాబోతున్న ఈ మూవీతో పవన్ రీ ఎంట్రీ గ్రాండ్ గా ఉంటుందని అభిమానులు విపరీతమైన అంచనాలు వేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: