మెగా మేనల్లుడు ఇపుడు టాక్ ఆఫ్ ది  టాలీవుడ్ అయిపోయాడు. ఉప్పెనకు ముందు వైష్ణవ్ తేజ్ అంటే మెగా మేనల్లుడు అని మాత్రమే తెలుసు. ఇపుడు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో వైష్ణవ్ తేజ్ టాలీవుడ్ కి హాట్ ఫేవరేట్ గా మారిపోయాడు. ఈ యంగ్ హీరోతో సినిమా చేస్తే గ్యారంటీ హిట్ అన్న అభిప్రాయంతో ఫిల్మ్  మేకర్స్ ఉన్నారు.

పైగా ఫస్ట్ సినిమాతోనే వైష్ణవ్ తేజ్ తన స్టామినా ఏంటో చాటి చెప్పాడు. నిజానికి ఎవరైనా ఫస్ట్ మూవీ ఫరవాలేదు అనిపించుకుంటే చాలు అని ఆలోచిస్తారు. ఇప్పటి స్టార్లు కూడా ఫస్ట్ మూవీలో జస్ట్ అలా పాస్ అయ్యారు అంతే.  కానీ వైష్ణవ్ తేజ్ మాత్రం తొలి అడుగే బలంగా వేశాడు. అలా  రికార్డుల వేట మొదలుపెట్టాడు. భారీ టార్గెట్ కి గురి పెట్టి సక్సెస్ బాట పట్టాడు.

ఇపుడు చూసుకుంటే వైష్ణవ్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. మొదటి సినిమాకు అలా జస్ట్ 50 లక్షల పారితోషికం తీసుకున్న వైష్ణవ్ తేజ్, క్రిష్ తో నటించిన రెండవ సినిమాకు డెబ్బై అయిదు లక్షల దాకా వెళ్లాడు. ఎపుడైతే ఉప్పెన హిట్ అయిందో ఏకంగా రెండు కోట్ల పై మాటగా తన రెమ్యునరేషన్ పెంచేశాడు అంటున్నారు.

ఇది నిజంగా షాకింగే మరి. అయితే వైష్ణవ్ స్టామినాను చూసే మేకర్స్ ఆ అమౌంట్ ఆఫర్ చేస్తున్నారు అంటున్నారు. ఇదిలా ఉంటే వైష్ణవ్ తేజ్ తో తరువాత సినిమా తీయాలని టాలీవుడ్ కింగ్ నాగార్జున భారీ ప్లాన్ వేశారు. అందుకోసం ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా తీసేసుకున్నారు. ఇక వైష్ణవ్ తేజ్ తో నాగ్ తీసే సినిమాకు గానూ ఏకంగా మూడు కోట్ల అతి పెద్ద రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని టాక్ అయితే వినిపిస్తోంది. మనం ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద నాగ్ తీస్తున్న ఈ మూవీ తో వైష్ణవ్ మరో మెట్టు ఎక్కుతాడు అంటున్నాడు. మొత్తానికి నాగ్ భారీ గిఫ్ట్ మెగా మేనల్లుడికి ఇచ్చాడని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: