టాలీవుడ్ లోని సినిమాలలో ఒక ప్రత్యేకత ఉంటుంది అది పెద్దగా చెప్పనవసరం లేదు.. కానీ అందులో కొన్ని సినిమాలు మాత్రం చరిత్ర రికార్డ్ ను క్రియేట్ చేస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. మరీ ముఖ్యంగా సినిమాల విషయంలో కామెడీ సినిమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.. అందులో కొన్ని సినిమాల పేర్లు వినగానే  ఇప్పటికీ పెదాలపై చిరునవ్వు కనిపిస్తుంది. అంతలా ప్రేక్షకుల మదిలో ఆ కామెడీ చిత్రాలు చిరస్థాయిగా నిలిచిపోయాయి.. అయితే ఆ చిత్రాలు ఏంటో.. అందులో కొన్ని మాత్రమే మనం ఇక్కడ చూసి తెలుసుకుందాం..

1. జంబలకడిపంబ :
ఆమని, నరేష్ జంటగా తెరకెక్కిన చిత్రం జంబలకడిపంబ. ఈచిత్రంలో అగ్ర హాస్యనటులు అంతా కలిసి వినోదాన్ని పంచారు.. ఈ సినిమా ఎప్పుడు బుల్లితెరపై వచ్చినా మంచి టిఆర్పి రేటింగ్ ను సాధిస్తుంది. అంతే కాకుండా ఈ సినిమా పేరు వినగానే ప్రేక్షకుల ముఖంపై చిరునవ్వు అట్టహాసంగా కనిపిస్తుంది. అంతలా ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది..

 2.చిత్రం భళారే విచిత్రం :
ఇక ఈ సినిమాలో కూడా హీరో నరేష్ తన అద్భుతమైన నటనను కనబరిచి,  ప్రేక్షకులను  మంత్రముగ్ధుల్ని చేశాడు.. అంతేకాకుండా కామెడీ  చిత్రాలకు నరేష్ పెట్టింది పేరుగా చిరస్థాయిగా నిలిచి పోయాడు . ఈ సినిమాలో  లేడీ అవతారంలో నరేష్ పాత్ర చాలా బాగుంటుంది.. ఇందులో నరేష్, మహర్షి రాఘవ,బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్ బ్యాచ్ మంచి ఆనందాన్ని పంచింది..

3. పెళ్లి చూపులు :
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లి చూపులు సినిమా ఈ తరానికి మంచి కామెడీ ని అందించింది. ఇక విజయ్ దేవరకొండ కు కూడా మంచి గుర్తింపు తీసుకువచ్చింది ఈ సినిమా. అంతేకాకుండా ఈ సినిమాలో ప్రియదర్శి మంచి నటనతో ఆకట్టుకున్నాడు.

4. చంటబ్బాయి:
జంధ్యాల దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి హీరోగానే కాకుండా తనలో కమెడియన్ యాంగిల్ కూడా ఉందని నిరూపించాడు..

అంతేకాకుండా ఏప్రిల్ 1 విడుదల,  ఆ ఒక్కటి అడక్కు, మన్మధుడు 2, మాయాబజార్,  నమస్తే అన్నయ్య ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు మంచి హాస్యాన్ని పంచాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: