స్టార్ హీరోలకు ఈ అమ్మడే లక్కీగా కలిసి వస్తోంది. ఈ చిన్నది ఉంటే పక్కా హిట్ అనే విధంగా పేరు తెచ్చుకుంది స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్. ఈ అమ్మడు ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా అన్నింటికీ ఓకే చెబుతూ వెళుతోంది ఈ ముద్దుగుమ్మ. గత కొంత కాలం శ్రుతి హాసన్ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. కాగా క్రాక్ తో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది. రాగానే రవితేజ తో నటించి ఈ అమ్మడు హ్యాట్రిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ ‘క్రాక్’ మూవీ శ్రుతి హాసన్ కు ఎప్పటికీ గుర్తుండే హిట్ ను అందించింది. ఈ సినిమా అలా హిట్ అయ్యిందో లేదో.. అప్పుడే ఈ చిన్నదానికి వరుసగా ఆఫర్స్ కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. అందులో ఇక పాన్ ఇండియా మూవీ కూడా రావడం ఈ అమ్మడి లక్ అనే చెప్పుకోవాలి. తెలుగు సినిమాలతో పాటుగా ఈ బ్యూటీతమిళ సినిమా కూడా చేస్తోందట.
ఇంకొన్ని ఆఫర్లు కూడా చర్చల దశలో ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇక అసలు విషయానికొస్తే.. ప్రస్తుతం శ్రుతి హాసన్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో ‘లాభం ’సినిమాలో నటించనుంది. దీంతో పాటుగా రెబల్ స్టార్ ప్రభాస్ కు జోడీగా ‘సలార్’ మూవీలో నటిస్తోంది శ్రుతి. ఈ రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నవే. కానీ ఇందులో సలార్ సినిమా పాన్ ఇండియాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాతో పాన్ ఇండియా డ్రీమ్ శ్రుతి తీర్చేసుకున్నట్టే. ఇన్ని రోజులు ఈ చిన్నదానికి పాన్ ఇండియా మూవీలో నటించాలనే బలమైన కోరిక ఉండేదట. ఇక ప్రభాస్ సరసన నటించడంతో ఆ కోరిక కాస్త తీరిందనే చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని కూడా ఏకంగా శ్రుతిహాసనే ఓ సందర్భంగా బయటపెట్టింది.  

ఇక ఆఫర్ కూడా రావడంతో శ్రుతి ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ప్రస్తుతం వరుసగా గ్లామర్ ఫోటోలకు ఫోజులిచ్చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు తన ఇన్ స్టాలో ఓ పిక్ ను షేర్ చేసి అందరి మతులు పోగొడుతోంది. అందులో శ్రుతి అందాలు చేస్తే.. ఎవరైనా ఫిదా అయ్యి ప్రీజ్ అవ్వాల్సిందే. జీన్స్ మోడరన్ లుక్ లో నడుము అందాలను కుర్రకారుకు ఎరగా వేసింది. అసలే ఈ అమ్మడుకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. అలాంటి శ్రుతి ఇప్పుడు ఏకంగా నాభి అందాలను చూపించి.. ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తోంది. ఈ ఫోటోనే ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: