త‌న‌కు క‌న్న‌డ వాళ్లు ఇచ్చిన రెస్పెక్ట్ తెలుగు వాళ్లు ఇవ్వ‌లేదని జ‌గ‌ప‌తిబాబు అన్నారు. క‌న్న‌డ స్టార్ హీరో ద‌ర్స‌న్ న‌టించిన రాబ‌ర్ట్ సినిమాను తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమాకు త‌రుణ్ కిషోర్ సుధీర్ ద‌ర్స‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాను మార్చ్ 11న తెలుగులో విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ప్ర‌చారం లో భాగంగా హైద‌రాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించిన న‌టుడు జ‌గ‌పతిబాబు హాజ‌ర‌య్యారు. కార్య‌క్ర‌మంలో జ‌గ‌ప‌తిబ‌బు మాట్లాడుతూ హీరో ద‌ర్స‌న్ పై క‌న్న‌డ వాళ్ల‌పై ప్ర‌శంస‌లు కురింపిచారు.  నేను పెద్ద‌గా సినిమా కార్యక్ర‌మాల‌కు రావ‌డం లేద‌ని మీకు తెలుసు. కానీ ఈ సినిమా ఫంక్ష‌న్ కు రావాలి. క‌న్న‌డ వాళ్ల గురించి చెప్పా‌లి అందుకే వ‌చ్చాను. నేను ముందు క‌న్న‌డ సినిమాలు చేసాను. అన్నీ ప్లాప్ అయ్యాయి..నాకు సాధార‌ణంగానే హిట్ ఆల‌స్యంగా వ‌స్తుంది. ఈ సినిమా కథ చెప్ప‌గానే భాగా న‌చ్చింది. సూప‌ర్ హిట్ అవుతుంద‌న్న న‌మ్మ‌కం క‌లిగింది. అందుకే ఈ సినిమాలో న‌టించ‌డానికి వెంట‌నే ఒప్పుకున్నాను.

ఇలాంటి హీరో నిర్మాత‌, ద‌ర్శ‌కుడు వ‌స్తే ఈ సినిమానే కాదు...ఏ సినిమాకైనా ఓకే చెబుతా ద‌ర్శ‌న్ కాళు నేల‌పై ఉంటాయ‌ని అంద‌రూ అంటూ ఉంటారు. ద‌ర్శ‌న్ కాళ్లు మాత్ర‌మే కాదు. త‌ల కూడా నేల‌పైనే ఉంటుంది. అత‌ను మాత్రం ఎప్పుడూ ఆకాశంలోనే ఉంటారు. న‌టీ న‌టులు న‌టించ‌డం గొప్ప విష‌యం కాదు ప్ర‌తి ఒక్క‌రూ న‌టిస్తారు. ద‌ర్శ‌న్ రియ‌ల్ లైఫ్ లో కూడా హీరోగా ఉంటాడు. ద‌ర్శ‌న్ ఎవ‌రు ఏది అడినా వెంటనే ఇచ్చేస్తాడు. అవి కోట్ల‌యినా కావ‌చ్చు ఇంకేమైనా కావ‌చ్చు. అలాగే నేను క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌కు వెళ్లి సినిమాలు తీసినప్పుడు నాకు అక్క‌డ వాళ్లు ఇచ్చిన రెస్పెక్ట్ తెలుగు వాళ్లు కూడా ఇవ్వ‌రు. వాళ్లు ఒక్క‌టే చెప్పారు. మీరు మా ఇంటికి వ‌చ్చారు కాబ‌ట్టి మీరు మా గెస్ట్‌.. అన్నారు. ఇప్పుడు వాళ్లు మ‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. మ‌నం కూడా వాళ్ల‌కు రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటూ జ‌గ‌ప‌తి బాబు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: