చిత్ర పరిశ్రమలో అదృష్టం ఎవరికి ఎప్పుడు కలిసి వస్తుందో ఎవరికీ తెలీదు. కొందరికి పది సినిమాలు చేసిన గుర్తింపు రాదు.. కానీ కొందరికి ఒక్క సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆలాంటి వారి జాబితాలో ఇప్పుడు కృతిశెట్టి కూడా చేరారు. కృతిశెట్టి ఉప్పెన సినిమాతో  హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైయ్యారు. ఈ సినిమాతో హీరోయిన్ గా కృతిశెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా విడుదలైన తర్వాత బ్లాక్ బస్టర్ సినిమాగా మారి పెద్ద ఎత్తున కలెక్షన్ కొల్లగొడుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం.

అయితే ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమాకు అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఏ డెబ్యూ హీరోకు సాధ్యం కాని రీతిలో ఉప్పెన వసూళ్ల ఉప్పెన కురిపిస్తుంది. 40 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఔరా అనిపిస్తుంది ఈ సినిమా.  ఇక అసలు విషయం లోకి వస్తే కృతిశెట్టి రెమ్యునరేశన్ విషయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఉప్పెన సినిమాకు 6 లక్షల పారితోషికం తీసుకున్న ఈ కృతి శెట్టి, ఇప్పుడు ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఇప్పుడు తను భవిష్యత్తులో సైన్ చేయబోయే సినిమాలకు 60 లక్షల పారితోషికం డిమాండ్ చేస్తున్నదని సినీ వర్గాలలో వార్త హల్ చల్ చేస్తోంది.అయితే ఒక సినిమా హిట్ కే ఇంతలా పారితోషికం పెంచేసిందా అని సినీ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నారు.

అంతేకాదు ముందు ముందు మరిన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అయితే ఒక కోటి రూపాయల పారితోషికాన్ని డిమాండ్ చేసే అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనా మొత్తానికి 17 ఏళ్ల వయసులోనే మొదటి సినిమాతోనే సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు పొందిన కృతిశెట్టి భవిష్యత్తులో మరిన్ని నటన ప్రాధాన్యత పాత్రలను ఎంచుకుంటూ ఉంటే తెలుగు ప్రేక్షకులు ఈ హీరోయిన్ అక్కున చేర్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: