టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం పూజా హెగ్డే మాంచి ఫాంలో దూసుకెళుతోంది. హీరోయిన్ గా పరిచయమైన అనతి కాలంలోనే ఈ అమ్మడు తెలుగు తెరపై అగ్ర కథానాయికగా కొనసాగుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ చిన్నది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. వివిధ భాషల్లో ఈ కన్నడ బ్యూటీ నటిస్తున్నా.. తెలుగులోని ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. కెరియర్ ను ప్రారంభించిన మొదట్లో ఈ చిన్నది వరుసగా ఫ్లాపులను ఎదుర్కొన్నా.. ఆ తర్వాత గేర్ ను మార్చేసి.. తన అందచందాలతో కుర్రకారుకు వలేసి.. ప్రేక్షకులను కట్టిపడేసింది. వన్స్ తన అందచందాలతో ప్రేక్షకులను ఆకర్షించడం మొదలు పెట్టిన పూజా టాప్ హీరోయిన్ గా ఎదుగుతూ వచ్చింది. టాలీవుడ్ లో ఉన్న టాప్ స్టార్ సరసన పాజా హెగ్డే ఆడిపాడింది. అయినా చిన్నా పెద్దా హీరోలంటూ భేదం చూపించకుండా ఈ చిన్నది స్క్రిప్టు నచ్చితే చాలు ఏ హీరో అయినా సరే నటించడానికి సిద్దంగా ఉంటుంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటిస్తూనే, అక్కినేని యువ హీరో అఖిల్ కు జోడీగా కూడా నటిస్తోంది. వీటితో పాటుగా ఈ బ్యూటీ ఇంకొన్ని సినిమాలను కూడా లైన్లో పెట్టేసింది. రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ‘రాధేశ్యామ్’ సినిమాలో ప్రభాస్ సరసన పూజా నటిస్తోంది. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే అక్కినేని యువ హీరో అఖిల్ కు జోడీగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో కూడా పూజా నటిస్తోందన్న సంగతి తెలిసిందే. వీటితో పాటుగా పూజా హెగ్డే.. టాలీవుడ్, బాలీవుడ్, ఇతర భాషల సినిమాల్లో నటిస్తోంది. ఇకపోతే తమిళంలో ఓ సినిమాలో చిన్నది నటించబోతుందంటూ.. వార్తలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి.

అది కూడా స్టార్ హీరో దళపతి విజయ్ సినిమాలోనే పూజా ఛాన్స్ కొట్టేసినట్టు గుసగుసలు వినిపించాయి. విజయ్ తన 65వ సినిమాను కూడా ప్రకటించాడు. ఇందులో పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకుంటున్నట్టు వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. ఇక తాజాగా ఈ వార్తలపై పూజా స్పందిస్తూ.. ఆసక్తికరమైన విషయాలను వెళ్లడించింది. ఒక వేళ అలాంటి అద్బుత అవకాశమే వస్తే.. నేను దాన్ని అస్సలు వదులుకోను అంటూ తన మనసులోని మాటలను బయటపెట్టేసింది బుట్టబొమ్మ. అందులోనూ విజయ్ 65వ సినిమాలో నటించాలని ఎంతో ఆశగా ఉందంటూ తెలిపింది బుట్టబొమ్మ పూజా హెగ్డే. ఈ ఆఫర్ వర్కౌట్ అయితే ఎంతో బాగున్నో  అంటూ పూజా.. తన ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: