సినీ పరిశ్రమలో గుర్తింపు రావాలంటే చాల కష్టపడాల్సి ఉంటుంది. ఒక్క హీరోకి రెండు సినిమాలు చేస్తే గుర్తింపు వస్తుంది. మరో హీరోకి మూడు, నాలుగు సినిమాలు చేసిన గుర్తింపు రాదు. కానీ.. కొంత మంది హీరోలకు మొదటి సినిమాతో మంచి పేరు గుర్తింపు తెచ్చుకుంటారు. వాళ్ళ గురించి తెలుసుకుందామా.

తాజాగా మెగా హీరో వైష్ణవ తేజ్, అందాల భామ కృతి శెట్టి కి డెబుట్ మూవీ ఉప్పెన. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయినా ఈ సినిమా అంచనాలు అందుకుని హిట్ గా నిలిచింది. నితిన్, సదా జంటగా నటించిన జయం సినిమా ఎంత హిట్ అయిందో చెప్పక్కర్లేదు. అల్లు అర్జున్ డెబుట్ మూవీ గంగోత్రి. ఆర్తి అగర్వాల్ చెల్లెలు అదితి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. రాఘవేంద్ర రావు ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.

ఉదయ్ కిరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా చిత్రం. రీమా సేన్ కూడా ఈ సినిమాతోనే పరిచయం అయ్యారు. ఈ సినిమా కూడా తేజ డైరెక్షన్ లోనే వచ్చింది. యశో సాగర్, స్నేహ ఉల్లాల్ హీరో హీరోయిన్లుగా వచ్చిన ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా కూడా మంచి హిట్ అయింది. ఈ సినిమా కరుణాకరన్ డైరెక్షన్ లో వచ్చింది. సుధీర్ బాబు ఏమాయ చేసావే సినిమాలో ఒక చిన్న రోల్ చేశారు. కానీ హీరోగా ఎంట్రీ ఇచ్చింది మాత్రం SMS తోనే. ఈ సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నేహా హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన సినిమా చిరుత. ఈ సినిమా కూడా హిట్ అయింది.

ఉషాకిరణ్ మూవీస్, స్రవంతి మూవీస్ బ్యానర్ లో వచ్చిన నువ్వే కావాలి సినిమా ఎంతలా హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఎనర్జిటిక్ హీరో రామ్ కి దేవదాస్ సినిమా ద్వారా గ్రాండ్ ఎంట్రీ దొరికినట్లయింది. వైవీఎస్ చౌదరి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా పరిచయం అయినా సినిమా పెళ్లి చూపులు. ఈ సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: