టాలీవుడ్ బడా హీరోలైన సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక దాని వెంట మరొకటి సినిమాలు చేసుకుంటూ కెరీర్ పరంగా వేగవంతంగా ముందుకు దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ సినిమా తోపాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఒక భారీ పీరియాడికల్ సినిమాని అలానే యువ దర్శకుడు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుం కోషియం చిత్రం తెలుగు రీమేక్ మూవీలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. కాగా వీటిలో వకీల్ సాబ్ ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోగా ప్రస్తుతం క్రిష్ తో పాటు సాగర్ చంద్ర సినిమాలు రెండూ షూటింగ్ శరవేగంగా జరుపూకుతున్నాయి.

కాగా వీటిలో వకీల్ సాబ్ మూవీ ఏప్రిల్ 9న రిలీజ్ కానుండగా క్రిష్ జాగర్లమూడి సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. మరోవైపు సర్కారు వారి పాట సినిమా చేస్తున్న మహేష్ బాబు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పై ఎంతో దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనేది మహేష్ బాబు ఆలోచన అని అంటున్నారు. ఇప్పటికే ఇటీవల దుబాయ్ లో ఒక భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సర్కారు వారి పాట అతి త్వరలో గోవాలో తదుపరి షెడ్యూల్ జరుపుకోనుంది. యువ సెన్సేషనల్ హీరోయిన్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తుండగా గీతగోవిందం మూవీ ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2022లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవల నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

అయితే ఇక్కడే ఒక పెద్ద చిక్కు సమస్య ఏర్పడుతోంది. సర్కారు వారి పాట తో పాటు పవన్, క్రిష్ ల సినిమా కూడా అదే సమయంలో రిలీజ్ కానుంది అనే వార్త వైరల్ అవుతుండడంతో ఈ ఇద్దరు హీరోల మధ్య పక్కాగా రాబోయే సంక్రాంతికి క్లాష్ తప్పదని అందరూ భావించారు. అయితే పవన్, క్రిష్ ల మూవీ యూనిట్ మాత్రం సినిమా పూర్తి చేయడానికి మరికొంత సమయం పడుతుందని అంటున్నట్టు టాక్. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ ఎంతో పెండింగ్ ఉందని వాటికి మరికొంత సమయం పెట్టె ఛాన్స్ ఉండడంతో ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేద్దామని పవన్ అన్నట్లు టాక్. మరి అదే గనక జరిగినట్లయితే మహేష్ మూవీ కి పవన్ మూవీకి క్లాష్ అయ్యే పరిస్థితి ఉండదని అంటున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: