ప్రస్తుతం బుల్లితెర యాంకర్ల హావ నడుస్తుంది. ఒకప్పుడు యాంకర్ అంటే పెద్దగా పట్టించుకొనేవారు కాదు.. కానీ ఎప్పుడైతే జబర్దస్త్ అంటూ అనసూయ బుల్లితెర ఫై అడుగుపెట్టిందో.. యాంకర్ల జతకమే మారిపోయింది. వెండితెర హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందం, గ్లామర్ షోతో ప్రేక్షకులను బుల్లితెరకు కట్టిపడేసేలా చేసింది అనసూయ. గత కొన్నేళ్లుగా అనసూయ హావ నడుస్తూ వస్తుంది. ముఖ్యంగా ఎపిసోడ్ ఎంట్రీ సాంగ్ తో అనసూయను మరచిపోకుండా చేసింది. ఇక ఈమె తర్వాత అంత పేరు తెచ్చుకున్న యాంకర్ రేష్మి గౌతమ్.

అనసూయ అంత గ్లామర్ చలాకీతనం లేనప్పటికీ ప్రేక్షకులను గ్లామర్ తో కట్టిపడేస్తూ వస్తుంది. వీరిద్దరి తర్వాత శ్రీముఖి , విష్ణు ప్రియా . వర్షిణి ని పోటీపడుతున్నారు. ఇక ఇప్పటికే శ్రీముఖి , విష్ణుప్రియ లు తమదైన గ్లామర్ తో వరుస ఛాన్సులు దక్కించుకుంటున్నారు. తాజాగా వర్షిణి సైతం స్టార్ మా లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ షో కు యాంకర్ గా ఛాన్స్ దక్కించుకుంది. ఈటీవీ లో ప్రసరవుతున్న జ‌బ‌ర్ద‌స్త్‌ కు పోటీగా స్టార్ మా లో కామెడీ స్టార్స్ స్టార్ట్ అయ్యింది. శేఖ‌ర్ మాస్ట‌ర్, న‌టి శ్రీదేవి జ‌డ్జిలుగా వ్యవహరిస్తుండగా..వ‌ర్షిణి, రవిలు యాంకర్లు గా చేస్తున్నారు.

ఈ షో లో వర్షిణి రేసు గుర్రం నుండి డౌన్ డౌన్ డప్పా సాంగ్ కు ఓ రేంజ్ లో రెచ్చిపోయి డ్యాన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చింది.  ఈమె డాన్స్ చూసి డాన్స్ మాస్టర్ శేఖర్ సైతం షాక్ అయ్యాడు. వర్షిణి లో ఇంత టాలెంట్ ఉందా అని కళ్లు పెద్దవి చేసి చూసాడు. వర్షిణి తీరు చూస్తుంటే అనసూయ రేంజ్ లో పేరు తెచ్చుకోవాలని గట్టిగానే ట్రై చేస్తున్నట్లు అర్ధమవుతుంది. మరి అమ్మడి కోరిక నెరవేరాలని కోరుకుందాం.                  

మరింత సమాచారం తెలుసుకోండి: