సినిమాల్లో హీరోల పక్కన, హీరోయిన్ల పక్కన చెల్లెలుగా నటిస్తూ ఉంటారు. కానీ ఆ బాలనటులు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఎగ్జైటింగ్ గా ఉంటుంది. అలాగే మహేష్ బాబు ఒక్కడు సినిమాలో చెల్లెలుగా నటించిన ఆ బాలనటి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా. ఇప్పుడు ఏం చేస్తుంది ఎలా ఉంది అన్న విషయం గురించి తెలుసుకుందాం.


 ఒకప్పటి బాలనటులు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసుకోవడం  వెనుక చాలా ఆసక్తి ఉంటుంది. అలాగే మిలీనియం కొత్తలో కొందరు చిన్నారులు ఇప్పుడు పెళ్లిడుకి వచ్చారు. అలా అప్పట్లో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ఒక్కడు సినిమాలో హీరో మహేష్ బాబు చెల్లెలుగా నటించిన పాపా  గుర్తుండే ఉంటుంది. ఆమె పేరు బేబీ నిహారిక. అప్పుడు బేబీ కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు ఈమె వయసు పాతికేళ్లకు పైగా నే ఉంటుంది. 2003 లో ఒక్కడు సినిమా వచ్చింది.


 అప్పట్లో ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసింది. ఒక్కడు సినిమాలో హీరో పాత్ర తో పాటు చెల్లి ఆశ పాత్ర కూడా బాగానే గుర్తింపు తెచ్చుకుంది. నిహారిక ఒక్కడు కంటే ముందు మోహన్ బాబు హీరో గా నటించిన యమజాతకుడు  సినిమా లో ఆయన మేనకోడలిగా నటించింది. ఆ తర్వాత ఒక్కడు అవకాశం వచ్చింది. అ సినిమా తర్వాత చాలా వరకు ఆఫర్స్ వచ్చినా కూడా నిహారిక నో చెప్పింది.


పూర్తిగా తన ఫోకస్ అంతా చదువులపై పెట్టింది. సినిమాల్లో అవకాశాలు వచ్చిన కూడా చదువుపైనే ద్రుష్టి సారించింది. ఈ మద్యే చదువు పూర్తి చేసుకున్న నిహారిక ఎప్పుడు మళ్ళీ సినిమాలో నటించడానికి సిద్ధమవుతొండి. దానికోసమే ఫోటోషూట్స్ కూడా చేస్తోంది ఒక్కడు భామ. ఈ అమ్మాయికి సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇప్పటి వరకు ఏ దర్శకుడు కూడా నిహారిక కు అయితే అవకాశాలు ఇవ్వలేదు. కానీ ఏ మద్యే ఓ ప్రముఖ దర్శకుడు ఈమెకు అవకాశం ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: