మాస్ మహారాజా రవితేజా సినిమాకు ఆడియన్స్ అన్ని వర్గాల వారూ ఉంటారు. అటు ఫ్యామిలీ సెక్షన్ తో పాటు ఇటు చిన్న పిల్లలు, ఇతర వర్గాలు కూడా రవితేజా సినిమాను చూసే వారిలో ఉంటారు. దాంతో ఆయన సినిమాకు మినిమం  గ్యారంటీ హిట్ అని  ఉంటుంది. ఇక రవితేజాకు ఈ మధ్యన సరైన హిట్లు లేవు కానీ క్రాక్ తో ఒక్కసారిగా దుమ్ము దులిపాడు.

వరసపెట్టి సినిమాలు చేయడమే కాదు, హిట్లు కూడా కొట్టాలని పక్కాగా డిసైడ్ అయ్యాడు. రవితేజా మూవీస్ అంటే కామెడీ తో పాటు యాక్షన్ కూడా ఉండాలి. క్రాక్ లో కామెడీ కొంత తగ్గింది అన్న విమర్శలు వచ్చాయి. ఇక రమేష్ వర్మ తీయబోతున్న సినిమా ఖిలాడీ మూవీతో రవితేజా సినిమా ఫుల్ మీల్స్ ఇస్తుందని అంటున్నారు. ఇదిలా ఉంటే రవితేజా ఈసారి కామెడీ మూవీస్ తీయడంలో పెర్ఫెక్ట్ అనిపించుకున్న నక్కిన త్రినాధరావుకి డేట్స్ ఇచ్చాడు. ఈ డైరెక్టర్ కొత్త సినిమా కోసం మంచి కధనే ఎంచుకున్నాడుట. రవితేజాతో కామెడీతో పాటు నవరసాలు పండించేలా మంచి కంటెంట్ తో రెడీ అయ్యాడని అంటున్నారు. ఇక ఈ మూవీ విషయంలో చూస్తే రవిరేజా డ్యూయల్ రోల్ ప్లే చేస్తాడని అంటున్నారు.

అలాగే ఈ సినిమాలో ఇద్దరిని హీరోయిన్లుగా ఎంచుకున్నారుట. అందులో ఒకరిగా ఇపుడు గ్యాంగ్ లీడర్ లో నటించిన ముద్దుగుగుమ్మ ప్రియాంక అరుళ్ ని తీసుకున్నారు అంటున్నారు. ఈ అమ్మడు  నాని పక్కన చాలా క్యూట్ గా ఆ మూవీలో కనిపిస్తుంది. ఇక మార్చి లో రిలీజ్ అయ్యే శర్వానంద్ శ్రీకారం మూవీలో కూడా ఆమె హీరోయిన్. ఈ మూవీ మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. దాంతో ప్రియాంక అరుళ్ ని రవితేజా మూవీలో తీసుకుంటారు అని అంటున్నారు. అదే కనుక జరిగితే ఈ అమ్మడు కి స్టార్ స్టాటస్ వచ్చేసినట్లే అంటున్నారు. మంచి హిట్ ట్రాక్ లో ఉన్న రవితేజా ప్రియాంకాకు కూడా మంచి ఫ్యూచర్ ఇస్తాడని చెప్ప్పుకుంటున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: