గతేడాది కరోనా మహమ్మారి కారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీ బోసిపోయింది. ఆన్ లాక్ తర్వాత తెలుగు తెర కొత్త కొత్త సినిమాలతో కళకళలాడుతోంది. అయితే ఈ ఏడాది బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమాలన్నీ.. క్రైమ్ ఇన్వెస్టిగేషన్, జైలు బ్రాక్యడ్రాప్, ఇంట్రాగేషన్లు  లు వంటి పోలీసుల కథలతోనే వచ్చినవి. ఈ కంటెంట్ పై వచ్చిన సినిమాలో బాక్సాఫీస్ లో కోట్లను వసూలు చేశాయి. కాగా ఈ రెండు నెలల్లో రిలీజైన సినిమాలు కూడా సేమ్ ఇదే ఫార్మాట్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కాగా ఇదే ఫార్మాట్ లో మరిన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి.
బాక్సాఫీస్ ను షేక్ చేసిన మాస్ మహారాజా నటించిన ‘క్రాక్’ సినిమా కూడా పోలీస్ స్టోరీనే. చాలా కాలం నుంచి మాంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న రవితేజకు ఈ మూవీతో హ్యాట్రిక్ హిట్ ను అందుకున్నారు. అలాగే దళపతి విజయ్, విజయ్ సేతుపతిలు నటించిన ‘మాస్టర్’ మూవీ కూడా  జైలు కాన్సెప్ట్ లో ఉంటుంది. ఎన్నో అంచనాలతో రిలీజైన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను వసూలు చేసింది. వీటితో పాటుగా రామ్ పోతినేని నటించిన‘రెడ్’ మూవీ కూడా క్రైమ్ థ్రిల్లర్ గానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఈ సినిమాలో కథ ఎక్కువ భాగం జైలులోనే నడుస్తుంది.

 ఇదిలా ఉంటే అల్లరి నరేష్ నటించన ‘నాంది’ సినిమా కూడా జైలు బ్యాక్ డ్రాప్ లోనే నడిచింది. జైలు నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలన్నీ సాలిడ్ హిట్ ను అందుకున్నాయి. కాగా జైలు, థ్రిల్లర్ అండ్ క్రైమ్ గా ఎన్ని సినిమాలు తెరకెక్కినా.. ప్రేక్షకులు మాత్రం ఆ సినిమాల పట్లనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలాంటి కంటెంట్ తో తెరకెక్కే సినిమాలే కలెక్షన్ల పరంగా భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ఇకపోతే అతి తొందరలోనే రిలీజ్ కాబోతున్న ‘వకీల్ సాబ్’ సినిమా కూడా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగానే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ వకీల్ సాబ్ మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఆడియెన్స్ ను మెప్పించే విధంగా ఉన్నాయో లేవో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: