బాలీవుడ్ ఇండ్రస్టీ లో ఉన్న అగ్ర నటుల్లో అభిషేక్ బచ్చన్ఒకడు.. విభిన్న తరహా సినిమాలల్లో నటిస్తున్న ఈయన..తన తండ్రి అమితాబ్ బచ్చన్ సూపర్ స్టార్ అయినా కూడా  తన నటనతో ప్రేక్షకుల చేస్తా శబాష్ అనిపించుకుంటున్నాడు అభిషేక్. మెయిన్ హీరోగానేకాకుండా సెకండ్ హీరోగా నటిస్తూ మెప్పిస్తున్నాడు అభిషేక్. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. అయితే ఈ మధ్య సరైన సక్సెస్ లేక సతమతం అవుతున్నాడు అభిషేక్. ఇంతకాలం ఇండస్ట్రీలో కొనసాగుతున్నా వెనక్కితిరిగి చూసుకుంటే అభిషేక్ చేసిన సినిమాల్లో సాలిడ్ హిట్ ఒక్కటి కూడా లేదు.

అయితే చాలా మంది తమ పేరులో మార్పులు చేసుకుంటే లాక్ కలిసొస్తుందని అనుకుంటూ ఉంటారు. మనదగ్గర కూడా చాల మంది తమ పేరులో మార్పులు చేసుకున్నారు.మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా తన పేరులో మార్పుచేసుకున్న విషయం తెలిసిందే. చాలా కాలంగా హిట్లు లేక ఇబ్బంది పడ్డ సాయి ధరమ్ తేజ్. చిత్రలహరి సినిమాకు తన పేరులో ధరమ్ ను తొలగించాడు, దాంతో అతడి పేరు సాయి తేజ్ అయింది. అనుకున్నట్టుగానే ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో తేజ్ తన పేరును సాయి తేజ్ గా కంటిన్యూ చేస్తున్నాడు.

ఇప్పుడు అభిషేక్ కూడా తన పేరును మార్చుకున్నాడు అయి పూర్తిగా కాదు. అభిషేక్ బచ్చన్ తన పేరు మధ్యలో ‘ఏ’ అనే అక్షరం చేర్చనున్నట్లు తెలుస్తుంది. ఫేమస్ న్యూమరాలజిస్ట్ సంజయ్ బి జుమాని ఇచ్చిన సలహా మేరకు అభిషేక్ తన పేరులో మరో అక్షరాన్ని జత చేసుకున్నాడని తెలుస్తుంది. ఇదిలా ఉంటే అభిషేక్ ప్రస్తుతం దస్వి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్స్ లో కూడా అభిషేక్ ఏ బచ్చన్ అనే పేరు వేశారు మేకర్స్..మరి ఈ మార్పు మన అభిషేక్ బచ్చన్ కి ఏమైనా కలిసొస్తుందేమో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: