ఇండియన్‌ ఐడల్‌ దీని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో ద్వారా ఎంతో మంది గాయకులు తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నారు. ఇక మన తెలుగు గాయనీగాయకులు కూడా ఈ షోలో పాల్గొన్నారు. బుల్లి తెరపై అత్యంత ప్రతిష్టాత్మక షో ఇండియన్ ఐడల్ లో తెలుగు గాయనీగాయకులు కూడా పాల్గొనడానికి మార్గం ఏర్పరచింది కారుణ్య. ఇండియన్ ఐడల్ రెండవ సీజన్లో రన్నరప్ గా నిలిచాడు. ఇక ఆ సీజన్ లో సందీప్ ఆచార్య టైటిల్‌ను విన్నర్ నిలిచాడు.

అయితే శ్రీ రామ చంద్ర ఇండియన్ ఐడల్ లో పాల్గొనక ముందు తెలుగు సినిమాల్లోని పలు సాంగ్స్ కు ట్రాక్ సింగర్ గా పనిచేశాడు. అష్టా చమ్మ వంటి అనేక సినిమాల్లోని ట్రాక్‌తో సహా కొన్ని తెలుగు పాటలు పాడారు. ఇండియన్ ఐడల్ విజేతగా టైటిల్ గెలుచుకున్నాడు శ్రీ రామ చంద్ర. బాహుబలి వంటి సూపర్ హిట్ సినిమాలో మనోహరి సాంగ్ కు ట్రాక్ ను పాడి అందరి దృష్టిని ఆకర్షించాడు రేవంత్. అనంతరం 2017 లో ఇండియన్ ఐడల్ 9 లో పాల్గొన్నాడు. ఆ సీజన్ విన్నర్ గా నిలిచి సంగీత ప్రేమికుల మనసును దోచాడు.

ఇక ఇండియన్ ఐడల్ 9లో రేవంత్ తో పాటు పాల్గొన్న మరో తెలుగు గాయకుడు పివిఎన్ఎస్ రోహిత్. పాపులర్ సింగర్ సుఖ్వీందర్ సింగ్ కు రోహిత్ ను తన గాత్రంతో ఆకట్టుకున్నాడు. పివిఎన్ఎస్ రోహిత్ ఇండియన్ ఐడల్ 9లో టాప్ 3లో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఇండియన్ ఐడల్ 12 టైటిల్ కోసం పోటీ పడుతున్న వైజాగ్‌కు చెందిన పదిహేడేళ్ల బాలిక షణ్ముఖ ప్రియ. ఐదేళ్ల వయస్సు నుండే పలు షోల్లో పాల్గొన్న షణ్ముఖ ప్రియ జీ సరిగమ లిటిల్ చాంప్స్ 2017 లో ఫైనలిస్ట్. ఇండియన్ ఐడల్ 12లో మరో తెలుగింటి అమ్మాయి శిరీషా భాగవతుల. శ్రావ్యమైన శిరీష రం చిత్రని గుర్తు చేస్తుందని న్యాయనిర్ణేతలు అంటారు. 21 ఏళ్ల ఈ ఇంజనీర్ తన గానంతో న్యాయనిర్ణేతలు అలరిస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి: