ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...సుధీర్ఘ లాక్ డౌన్  తరువాత డిసెంబర్ నుంచి థియేటర్ లు ఓపెన్ అయిన సంగతి తెలిసిందే.. ఇక జనవరి నెలలో నాలుగు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.వాటన్నిటిలో ఒక "అల్లుడు అదుర్స్"తప్ప మిగతావి సక్సెస్ ని అందుకున్నాయి. ఇక క్రాక్ సినిమా అయితే పెద్దగా చెప్పనవసరం లేదు. భారీ లాభలతో పెద్ద హిట్ అయ్యింది.మిగిలిన సినిమాలు కూడా పర్వాలేదనిపించాయి. దీంతో ఫిబ్రవరిలో రాబోయే సినిమాలపై టాలీవుడ్ చాలా ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే ఈ నెలలో చాలా సినిమాలు విడుదలయ్యాయి. పైగా ప్రభుత్వం థియేటర్లకు నూరు శాతం ఆక్యుపెన్సీ ఇచ్చింది. ఫిబ్రవరి మొదటి వారం నుండే కనీసం మూడు, నాలుగు సినిమాలు విడుదల కావడం మొదలైంది. గత రెండు వారాల్లోనే పదిహేనుకి పైగా సినిమాలు విడుదలయ్యాయి.


వీటిలో మెగా మేనల్లుడు 'ఉప్పెన' సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కొత్త వాళ్లతో తీసినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తుంది.దాదాపు ఈ నెల మొత్తం ఈ సినిమా హవానే కొనసాగుతుంది. ఇదే నెలలో విడుదలైన అల్లరి నరేష్ 'నాంది' సినిమా ఉత్తమ చిత్రంగా నిలిచింది. చాలా కాలం తరువాత ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు నరేష్. నిర్మాతలకు భారీ లాభాలు రానప్పటికీ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది. అలానే నాన్ థియేట్రికల్ రైట్స్ రేటు బాగా పలికింది.


ఇక తేజ సజ్జా నటించిన 'జాంబీరెడ్డి' సినిమా పర్వాలేదు అనిపించుకుంది కానీ పెద్ద హిట్ కాలేకపోయింది. మొత్తానికి ఈ నెలలో టాలీవుడ్ కి కేవలం రెండు హిట్లు మాత్రమే దక్కాయి. ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదలైన నితిన్ 'చెక్' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తుస్సుమని ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమాతో పాటు వచ్చిన మిగిలిన ఏ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద నిలదొక్కుకోలేకపోయాయి. వచ్చే నెలలో కూడా చాలా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులో క్రేజ్ ఉన్న సినిమాలు చాలానే ఉన్నాయి. మరి అవి ఎంత మాత్రం హిట్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర నీలాదొక్కుకుంటాయో చూడాలి. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి....


మరింత సమాచారం తెలుసుకోండి: