ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకులలో మోహన కృష్ణ ఇంద్రగంటి ఒకడు.తనదైన స్టైల్ లో సినిమాలు చేసి ఎంతగానో ఆకట్టుకున్నాడు. నాచురల్ స్టార్ నాని తో చేసిన 'అష్టా చమ్మా' సినిమా ఎంత బాగా హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఆ సినిమా నుండీ ఆయన తెరకెక్కించిన సినిమాలు అన్నీ కూడా క్లాస్ ఆడియెన్స్ ను ఎంతగానో అలరిస్తూనే వచ్చాయి.ఇక నాని తో రెండవసారి 'జెంటిల్మెన్' వంటి సస్పెన్స్ థ్రిల్లర్ ను తెరకెక్కించిన ఇంద్రగంటి ఆ సినిమాతో మంచి హిట్ ని అందుకున్నాడు. ఇక ఆ సినిమా తరువాత  అడివి శేష్ తో 'అమీ తుమీ' వంటి కామెడీ మూవీ అలాగే.. సుధీర్ బాబు తో 'సమ్మోహనం' వంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని తెరకెక్కించి పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ అని నిరూపించుకోవడం జరిగింది...



అయితే తన ఇమేజ్ ను మరింతగా పెంచుకోవాలి అని భావించి 'వి' అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. భారీ అంచనాల నడుమ గతేడాది అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ చిత్రం బాగా నిరాశపరిచింది.ఇంద్రగంటి ఇలాంటి సినిమా చేశాడేంటబ్బా అనుకోని ప్రేక్షకుడు ఉండడు అనడంలో అతిశయోక్తి లేదు. అయినప్పటికీ 'వి' ఎఫెక్ట్ నుండీ అతను తొందరగానే బయటపడే ప్రయత్నం చేస్తున్నాడు. తన శిష్యుడు అలాగే తనకు సమ్మోహనం వంటి మంచి హిట్ ఇచ్చిన సుధీర్ బాబుని హీరోగా పెట్టి ఓ మంచి ప్రేమకథని తెరకెక్కిస్తున్నాడు.


ఇక ఈ సినిమాలో "ఉప్పెన" సినిమాతో కుర్రకారుల మతులు పోగొట్టిన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది...ఎలా అయిన సుధీర్ తో తన మునుపటి స్టైల్ లో మంచి ప్రేమ కథని తెరకెక్కించి మంచి హిట్ కొట్టాలని కసితో వున్నాడు ఇంద్రగంటి...ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: