ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... అక్కినేని అఖిల్ ఒక్క హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు దాకా తీసిన మూడు సినిమాల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కాని బాక్స్ ఆఫీస్ వద్ద సరైన విజయాన్ని అందుకోలేకపోయాడు అఖిల్.. అందుకే ఈసారి ఎలాగైనా మంచి హిట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అంటూ తన అదృష్టాన్ని మరోసారి నిరూపించుకోవడానికి సిద్ధమైపోతున్నాడు.జూన్ 19వ తేదిన ఈ సినిమాని విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, ఈ సినిమాలో బొమ్మరిల్లు సినిమాలాగానే ఎమోషన్స్ పీక్స్ లో ఉంటాయని చెప్తున్నారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని, అందులో అఖిల్ యాక్టింగ్ అదిరిపోయి సినిమాకే పెద్ద హైలెట్ గా ఉండబోతోందని సమాచారం వినిపిస్తోంది.


ఇక ఈ సినిమాని అల్లు అరవింద్‌ గీతాఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు , వాసువర్మ నిర్మిస్తున్నారు.ఈ సినిమాపై అఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అంతేకాదు, చాలా రోజుల తరువాత బొమ్మరిల్లు భాస్కర్ తెలుగు ఇండస్ట్రీలో చేస్తున్న సినిమా కావడంతో ఇది హిట్ కొట్టడం అనేది డైరెక్టర్ కి కూడా చాలా అవసరం. అందుకే, ఈ సినిమాలో ప్రతి సన్నివేశాన్నీ చాలా జాగ్రత్తగా తీస్తూ హై డ్రామా ఉండేలా చూస్తున్నారట. చిలిపిగా కనిపిస్తూనే అఖిల్ ఎమోషన్స్ ని పలికిస్తాడని, హలో, మిస్టర్ మజ్నులని మించి క్లాస్ టచ్ ఇందులో ఉంటుందని చెప్తున్నారు.


ఈసినిమాలో వెన్నెలకిషోర్ కామెడీ, మురళీశర్మ యాక్టింగ్ కూడా హైలెట్ గా ఉండబోతోందని సమాచారం అందుతుంది..ఇక హాట్ బ్యూటీ పూజా హెగ్దే గ్లామర్ కూడా ఈ సినిమాకి బాగా ప్లస్ అవుతుందట.. ఇక ఈ సినిమా తరువాత అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే... ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: