ర‌కుల్ ప్రీత్‌సింగ్‌.. ఈ పేరు వింటేనే యువ‌కుల గుండెల్లో రైళ్లు పెరిగెడ‌తాయి. త‌న అంద‌చందాల‌తోపాటు న‌ట‌న ప‌రంగా మంచి హావ‌భావాలు ప‌లికిస్తూ మంచి పేరు సంపాదించుకోవ‌డ‌మే కాకుండా త‌క్కువ వ‌య‌సులోనే వ్యాపార‌వేత్త‌గా కూడా మంచి ఆదాయాన్ని కూడా వెన‌కేసుకుంది. గ్లామ‌ర్‌కి, ఆరోగ్యానికి ప్రాధాన్య‌మిచ్చే ర‌కుల్ ప్ర‌తిరోజు వ్యాయామం చేస్తూ ఆ చిత్రాల‌ను సోష‌ల్ మీడియాలో పెడుతూ అభిమానుల్ని సంపాదించుకోవ‌డ‌మే కాకుండా ఇత‌ర క‌థానాయిక‌ల‌కు కూడా ఆద‌ర్శంగా నిలుస్తోంది.

ఇటీవ‌ల కాలంలో ప‌లు వ్యాపార‌ల‌తో కొంత ఆదాయాన్ని వెన‌కేసుకుంది. అయితే కొద్దికాలంగా న ష్టాల‌ను కూడా చ‌విచూడాల్సి వ‌స్తోంది. ఆమె న‌ష్ట‌పోయినా సంస్థ‌లో ప‌నిచేసిన‌వారికి మాత్రం ఏ లోటు లేకుండా వేత‌నాలు చెల్లించింది. కొంతకాలంగా వరుస అపజయాలను ఎదుర్కొంటున్న అమ్మడు ఎలాగైనా నెక్స్ట్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద హిట్స్ అందుకోవాలని అనుకుంటోంది. ముఖ్యంగా తెలుగులో ఆమె గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయిన విషయం తెలిసిందే. హిందీలో మేడే సినిమాతో పాటు జాన్ అబ్రహం ఎటాక్ అలాగే సర్దార్ అండ్ గ్రాండ్సన్ అనే మరో సినిమా చేస్తోంది. ఇటీవల చెక్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.  గ్లామరస్ గా కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న లాయర్ పాత్రలో నటించింది. ఎఫ్ 45 ప పేరుతో ఫిట్నెస్ సెంటర్స్ ను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో అలా క్లిక్కయ్యిందో లేదో వెంటనే వైజాగ్ లో మరో బ్రాంచ్ ను ఓపెన్ చేసింది. ఇక ఆమె ఫిట్నెస్ సెంటర్స్ సంఖ్య ఎక్కువవుతున్న సమయంలో కరోనా లాక్ డౌన్ వ‌ల్ల నష్టాలు ఎదుర్కొందట.

ఇటీవ‌ల ఇచ్చిన ఒక ఇంట‌ర్వ్యూలో త‌న వ్యాపారాన్ని  కరోనా మహమ్మారి తీవ్రంగా దెబ్బతీసిందని ర‌కుల్ చెప్పింది. చాలా కాలం తరువాత మళ్ళీ క‌స్ట‌మ‌ర్ల‌ రాకతో పుంజుకున్నట్లు, ఇప్పుడు ఎప్పటిలానే కొనసాగుతున్నాయ‌ని చెప్పింది.  చెక్ త‌ర్వాత తెలుగులో క్రిష్ డైరెక్షన్ లో  ఒక సినిమాను పూర్తి చేసింది. అందులో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించాడు. తమిళ్ లో ఇండియన్ 2లో కాజల్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. శివకార్తీకేయన్ తో  ఒక సినిమా చేయడానికి ఒప్పుకుంది. అయితే ఇండియన్ 2 సినిమా షూటింగ్ జ‌రుగుతుందా?  లేదా? అనే విష‌యంపై ఇంకా స్పష్ట‌త రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: