పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈయనకు అభిమానులు ఎంతో మంది ఉన్నారు. ఈయన సినిమాల్లో తనదైన శైలిలో నటించి ఎంతో మంది ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీకి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో పరిచయమైన పవన్ కళ్యాణ్సినిమా తర్వాత గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ ఇలాంటి మంచి మంచి సినిమాలో నటించి ఆయన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. పవన్ కళ్యాణ్ మొట్టమొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. పవన్ కళ్యాణ్ క్రిష్ సినిమా విడుదల ఇది ఖరారు అయ్యింది.



 పవన్ కళ్యాణ్ క్రిష్  జాగర్లమూడి కాంబినేషన్లో ఓ పిరియాడిక్ యాక్షన్ ఫిలిం వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కొంత కాలం షూటింగ్ జరుపుకుంది. తర్వాత కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఇటీవల  కొత్త షెడ్యూల్ మొదలైంది. కాగా తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడూ ఎప్పుడూ అని ఎదురుచూస్తున్న ఆ అప్డేట్ రానే వచ్చింది. ఈ సినిమా విడుదల సమయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.


 పవన్ కళ్యాణ్ ఓవైపు ఏపీ రాజకీయాలు చేస్తూనే మరోవైపు ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. అందులో భాగంగా ఆయన క్రిష్ జాగర్లమూడి సినిమాలో నటిస్తున్నాడు. చారిత్రక నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వజ్రాల దొంగ గా కనిపించనున్నాడు అని అంటున్నారు. ఈ సినిమా పవన్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఏ ఎన్ రత్నం నిర్మాత వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ సరసన బాలీవుడ్ సుందరి జాక్వలైన్ ఫెర్నాండేజ్ స్పెషల్ రోల్ లో కనిపించనుంది అని టాక్. ఈ సినిమాకు టైటిల్ గా హరిహర వీరమల్లు గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో పవన్ పోషిస్తున్న వీరమల్లు పాత్రనే టైటిల్గా ఫిక్స్ చేసే దిశగా చిత్రబృందం ఆలోచిస్తోందట ఈ సినిమాకు గతంలో విరూపాక్ష,హర హర మహాదేవ టైటిల్ ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే . ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: