ఇటీవల జరిగిన బిగ్ బాస్ సీజన్ 4 లో ఒక కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసి దాదాపుగా చివరి వరకు తన ఆకట్టుకునే అట తీరుతో కొనసాగి ఎందరో ప్రేక్షకుల అభిమానంతో పాటు భారీ స్థాయి వోటింగ్స్ ని కూడా దక్కించుకున్న మోనాల్ గజ్జర్, ఆపై చివర్లో హౌస్ నుండి ఎలిమినేటి కాబడ్డారు. ఇక హౌస్ లో ఆమెకు, అలానే అఖిల్ సార్థక్ కి మధ్య కొంత ప్రేమ వ్యవహారం నడిచిందని, షో ముగిసిన తరువాత వారు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ అప్పట్లో పలు పుకార్లు విపరీతంగా షికారు చేసాయి. అయితే తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని, అలానే రాబోయే రోజుల్లో తమ స్నేహాన్ని ఇలానే కొనసాగిస్తాం అని వారిద్దరూ ఇటీవల బయటకు వచ్చిన తరువాత పలు మార్లు వెల్లడించడం జరిగింది. 

కాగా కొద్దిరోజుల క్రితం వారిద్దరూ కలిసి గుజరాతి అమ్మాయి, తెలుగు అబ్బాయి అనే పేరుతో ఒక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఇటీవల యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన అల్లుడు అదుర్స్ మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ చేసి అందరినీ ఎంతో ఆకట్టుకున్న మోనాల్ పలు భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటున్నట్లు టాక్. 

అయితే అసలు మ్యాటర్ ఏమిటంటే, అతి త్వరలో ఒక అగ్ర నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఒక యువ దర్శకుడు ప్రముఖ స్టార్ హీరోతో తీయనున్న భారీ ప్రతిష్టాత్మక సినిమాలో ఒక కీలక రోల్ చేసేందుకు మోనాల్ గజ్జర్ ఎంపికయిందని, ఇటీవల మోనాల్ ని కలిసిన సదరు దర్శకనిర్మాతలు ఆమెకు సినిమా యొక్క కథనాలు వినిపించి ఆమోదం అందుకున్నట్లు చెప్తున్నారు. కాగా దానికి సంబందించి అతి త్వరలో అధికారిక ప్రకటన కూడా రానుందట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: