సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సమంత లానే పెళ్లి తర్వాత కూడా తన ఫోకస్ కెరియర్ మీద కొనసాగిస్తుంది. ప్రస్తుతం చిరు ఆచార్య, కమల్ ఇండియన్ 2 సినిమాల్లో నటిస్తున్న కాజల్ ఆ తర్వాత కూడా సినిమాలకు సైన్ చేసిందని తెలుస్తుంది. అంతేకాదు మంచు విష్ణు మోసగాళ్లు సినిమాలో కూడా కాజల్ నటించింది. ఓ పక్క సినిమాలు చేస్తూనే పెళ్లి తర్వాత హాట్ ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ ను అలరిస్తుంది కాజల్.

లేటెస్ట్ గా కాజల్ కోటు వేసుకుని దిగిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కోటు వేసుకుని ఉన్నా సరే అమ్మడి చూపులు మాత్రం కుర్రాళ్ల హృదయాలను గిలిగింతలు పెడుతున్నాయి. కోటు వేసుకుని ఇలా ఆడియెన్స్ ను డిస్ట్రబ్ చేయడం అమ్మడి వల్లే అయ్యిందని చెప్పొచ్చు. కాజల్ కోటు లుక్స్.. అభిమానులను పండుగ చేసుకునేలా ఉంది. సినిమాలు ఎలా ఉన్నా ఫోటో షూట్స్ మాత్రం కాజల్ కొనసాగించేలా ఉంది.

అమ్మడు ఫాం చూస్తుంటే ఎలా లేదన్నా మరో ఐదేళ్లు హీరోయిన్ గా కొనసాగే ఛాన్సులు ఉన్నట్టు అనిపిస్తుంది. తేజా లక్ష్మి కళ్యాణం నుండి సీత వరకు కాజల్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో అభిమానులను అలరిస్తుంది. గౌతం తో పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న కాజల్ పెళ్లి తర్వాత కూడా తన మార్క్ చూపించాలని చూస్తుంది. కాజల్ కూడా మరో సమంతలా తనదైన శైలిలో గ్లామర్ హీరోయిన్ గా కాకుండా అభినయానికి అవకాశం ఉన్న పాత్రల్లో నటించాలని చూస్తుంది.                                                            

మరింత సమాచారం తెలుసుకోండి: