సాధారణంగా సినీ ఇండస్ట్రీ అంటేనే కష్టంతో కూడుకున్నది.. వారి నటనతో ప్రేక్షకులను మెప్పించ గలగాలి.. లేదంటే సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టంగా మారుతుంది. ఆ కష్టాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి.. అంతేకాకుండా చాలా మంది సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొంతమంది హీరోలు కావాలని కలగంటే, మరికొంతమంది స్టార్ డైరెక్టర్ అవ్వాలని కలలు కంటుంటారు.. ఆ తరువాత ఎన్నో కష్టాలు పడి, సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ని సాధిస్తూ ఉంటారు.. అలా స్టార్ హీరో నుంచి దర్శకుడికి, దర్శకుడి నుంచి హీరో కి కొన్ని సినిమాలు స్టార్ డం ను తెచ్చిపెట్టాయి... అవేంటో..? వారెవరో..? ఇప్పుడు తెలుసుకుందాం..


1.పవన్ కళ్యాణ్,కరుణాకరణ్, పూరి జగన్నాథ్ :
బద్రి సినిమా ను పవన్ కళ్యాణ్ తో పూరి జగన్నాథ్ తెరకెక్కించాడు. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత తొలి ప్రేమ సినిమాతో కరుణాకరణ్ ను పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.


2.ప్రభాస్, వంశీ పైడిపల్లి,కొరటాల శివ :
వంశీ పైడిపల్లి, ప్రభాస్ నటించిన మున్నా సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇక తరువాత మిర్చి సినిమా ద్వారా టాలీవుడ్ లో అడుగు పెట్టి,అన్ని హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు కొరటాల శివ.


3.రవితేజ,బోయపాటి శ్రీను,హరీష్ శంకర్ :
భద్ర సినిమా ద్వారా టాలీవుడ్ లో అడుగుపెట్టాడు బోయపాటి శ్రీను. ఇక హరీష్ శంకర్ కూడా రవితేజ ద్వారానే షాక్ అనే సినిమా ద్వారా బాలీవుడ్ లో అడుగు పెట్టాడు.


4.అల్లు అర్జున్,సుకుమార్ :
ఆర్య సినిమా ద్వారా సుకుమార్ సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.


5.చిరంజీవి,కోడి రామకృష్ణ :
ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా ద్వారా కోడి రామకృష్ణ సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు..


6.వెంకటేష్,జయంత్ సీ పరాన్జీ :
ప్రేమించుకుందాం రా సినిమా ద్వారా పరాన్జీని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు వెంకటేష్.


 7.నాగార్జున, రాంగోపాల్ వర్మ :
 శివ సినిమా ద్వారా వర్మ ను టాలీవుడ్ కి పరిచయం చేసాడు నాగార్జున.


 8.ఎన్టీఆర్,ఎస్ ఎస్ రాజమౌళి, వివి వినాయక్ :
స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా రాజమౌళి సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆది సినిమా ద్వారా వి.వి.వినాయక్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: