నేషనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా నాలుగు సినిమాలను ఒప్పుకున్న సంగతి తెలిసిందే..ఇప్పటికే రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలను వరుసగా చేసుకుంటూ పోతున్న ప్రభాస్ వీటిలో రాధే శ్యామ్ ని ముందుగా రిలీజ్ చేయబోతుండగా అన్ని సినిమాలు పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం.. ఒక్కోటి ఒక్కో స్పెషల్ ఉన్న సినిమా..  ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సలార్ సినిమా ని నాగ్ అశ్విన్, ఆదిపురుష్ సినిమాల కన్నా ముందు చేస్తున్నాడు ప్రభాస్.

ఈ మధ్య కాలంలో మన తెలుగు నుంచి ఎన్ని సినిమాల తాలూకా విడుదల తేదీలు బయటకు వచ్చాయో తెలిసిందే. మొదటగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” నుంచి మొదలైన ఈ విడుదల తేదీల పర్వం ఇతర ఇండస్ట్రీ సినిమాల రిలీజ్ డేట్స్ పై కూడా పడింది. దీనితో అవి కూడా అనౌన్స్ అవుతూ వచ్చాయి..ఈ క్రమంలోనే ప్రభాస్ భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ “రాధే శ్యామ్” జూలై 30న కన్ఫర్మ్ చేసుకుంది.

ఇదిలా ఉంటే టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి టాపిక్ ఎప్పటికీ ట్రేండింగ్ గానే ఉంటుంది. ప్రభాస్ పెళ్లి ఎప్పుడెప్పుడు జ‌రుగుతుందా అని అభిమానులు కూడా ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. తాజాగా రెబల్ స్టార్ పెళ్ళి విషయంపై ఓ క్లారిటి వచ్చింది. ఆయన ఈ ఏడాదిలో పెళ్ళి చేసుకొబోతున్నట్లు సమాచారం. ఈ వివాహంతో తన మ్యారేజ్‌పై నిరంతరం వచ్చే పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టాలి చూస్తున్నాడు. తన సమీప బంధువు కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రభాస్ వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ అమ్మాయి అమెరికాలో ఉందని.. ఇటీవలే ఎమ్మెఎస్ కంప్లీట్ చేసినట్లుగా సమాచారం. ఆ యువతి వయసు 25 ఏళ్లని.. మే నెలలో ఆ ఆమ్మాయితో ప్రభాస్‌కు ఎంగెజ్‌మెంట్ జరగనుందని సమీప బంధువు ద్వారా తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: