తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. చిరంజీవి సెకండ్ సినీ ఇన్సింగ్ కూడా సూపర్ డూపర్ గా దూసుకెళ్తుంది. అయితే మెగాస్టార్ చిరంజీవిసినిమా ఒప్పుకోవాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి ఆ సినిమా ఒప్పుకుంటారు.

అయితే, ఆచార్య విషయంలో మాత్రం చిరు పెద్దగా ఆలోచించలేదట. కారణం, కొరటాల. ప్లాప్ లేని డైరెక్టర్, పైగా హిట్ తప్ప మరొకటి తెలియని డైరెక్టర్. దానికితోడు మంచి మెసేజ్ సినిమాలు తీస్తాడు అనే గుడ్ నేమ్. ఇవన్నీ చిరును ఎక్కువ ఆలోచించుకోకుండా చేసాయి. చివరకు సినిమా పూర్తి అవ్వడానికి రెడీ అవుతుంది. ఈ టైంలో ఆచార్య పై చిరుకు అనుమానం మొదలైంది.

అయితే ఎక్కడో అవుట్ డేటెడ్ డైలాగ్ లు, దానికి మించిన స్లో సాగే స్క్రీన్ ప్లే మొత్తంగా చిరులో ఇప్పుడు ఆచార్యపై అసలు నమ్మకం లేదట. ఒక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సినిమా కాబట్టి.. కాంబినేషన్ కి క్రేజ్ ఉంటుంది, ఓపెనింగ్స్ ఉంటాయి. మరి సినిమా తేడా కొడితే సినిమా కొన్నుకున్న బయ్యర్ల పరిస్థితి ఏమిటి ? అసలు నిర్మాత పరిస్థితి ఏమిటి ? అసలుకే సినిమాకు ఓవర్ బడ్జెట్ అయింది. అందుకే ఫస్ట్ కాపీ రెడీ అయ్యాక, సినిమా మొత్తం చూసి, కొన్ని సీన్స్ ను రీషూట్ చేయాలని చిరు ప్లాన్ చేస్తున్నట్లు చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ తరుణంలోనే చిరు షూటింగ్ కు విరామం లేకుండా షూట్ లో పాల్గొంటున్నాడట. ఆచార్యను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఇప్పటికే కొరటాలకు చిరు చెప్పారట. దాంతో కొరటాల కూడా గ్యాప్ లేకుండా షూట్ చేస్తున్నాడు. మరి భారీ అంచనాల మధ్య విడుదలు కానున్న ‘ఆచార్య’ ఆ అంచనాలను అందుకోవాలంటే మాత్రం, సినిమాలో భారీ కంటెంట్ ఉండాలి. మరి చివర్లో చిరు ఎలాంటి కంటెంట్ పెడతారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: