ఇదిలా ఉంటే ఉప్పెన మూవీ ఫిబ్రవరిలో వన్ అండ్ ఓన్లీ హిట్ మూవీగా నిలిచింది. ఈ మూవీ ద్వారా ఒక కొత్త హీరో ఇన్నేసి రికార్డులు క్రియేట్ చేయడం అంటే అంతకు మించి హిస్టరీ వేరేది లేదు అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ విషయంలో చాలా చెప్పాల్సి ఉంటుంది. కానీ ఉప్పెన దెబ్బకు చిత్తు అయిన మిగిలిన సినిమాల సంగతి ఇపుడు చెప్పుకోవాలి.
అదేలా అంటే అల్లరి నరేష్ హీరోగా నాంది సినిమా మంచి కంటెంట్ తో ఇదే నెలలో రిలీజ్ చేశారు. ఈ మూవీ నిజానికి ఉప్పెన తో పాటే రాకపోయి ఉంటే మంచి కలెక్షన్లు వసూల్ చేసేది అన్న మాట ఉంది. ఇక నితిన్ ఎంతో ఆశతో రిలీజ్ చేసిన చెక్ మూవీకి కూడా ఉప్పెన చెక్ చెప్పేసింది. గత ఏడాది ఫిబ్రవరి నెల తనకు కలసి వచ్చిందని నితిన్ మూవీని ఇదే నెలలో రిలీజ్ చేశాడు.
అది కూడా ఉప్పెన రిలీజ్ అయిన పదిహేను రోజుల తేడాతో చెక్ మూవీ వస్తే టాక్ వేరేగా వచ్చింది. అదే సమయంలో ఉప్పెన కలెక్షన్లు అసలు తగ్గడంలేదు మొత్తానికి మార్చిలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. వాటి సంగతి ఏంటి అన్నది ఎవరికీ తెలియడం లేదు. ఉప్పెన ఇదే స్పీడ్ తో ఉంటే మాత్రం ఆ మూవీకి దెబ్బే అంటున్నారు. ఎందుకో తెలియదు కానీ కొన్ని సినిమాలు ఆడియన్స్ ని అలా పట్టేస్తాయి. ఇపుడు అదే కోవలో ఉప్పెన మూవీని చూడాలని అంటున్నారు. దాంతో ఉప్పెన ముందు ఎవరూ పోటీకి రాలేకపోతున్నారుట.