ప్రస్తుతం ఉన్న సమాజం లో ప్రతి ఒక్కరు ఏదో ఒక జాబ్ సాధించాలనుకుంటారు. అలాంటివారికి మిలటరీ ఇంజనీర్ సర్వీసెస్-MES ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది . అంతేకాకుండా ఆర్మీ సర్వీసెస్ లో జాబ్ చేయాలని అనుకునే వారికి ఇది ఒక చక్కటి అవకాశం లాంటిది . అయితే ఆ ఖాళీల వివరాలను ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.


మిలటరీ ఇంజనీర్ సర్వీసెస్ -MES లో దేశవ్యాప్తంగా మొత్తం ఖాళీల సంఖ్య 502 గా ప్రకటించింది. డ్రాఫ్ట్ మ్యాన్ 52 పోస్టులు, సూపర్వైజర్ 450 పోస్టుల భర్తీ కి ప్రకటించింది. విద్యార్హతలను ఇంకా వెల్లడించాల్సి ఉంది. నోటిఫికేషన్ లో విద్యార్హత వివరాలు ఉంటాయి. ఆసక్తిగల అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం మిలటరీ ఇంజనీర్ సర్వీసెస్ -MES అధికారిక వెబ్సైట్ https://mes.gov.in/ ఫాలో కావాల్సి ఉంటుంది.


ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మార్చి మొదటి వారంలోనే ప్రారంభం కానుంది. మిలటరీ ఇంజనీర్ సర్వీసెస్ -MES కేంద్ర రక్షణ శాఖ పరిధిలో పనిచేసే ప్రముఖ కన్స్ట్రక్షన్ ఏజెన్సీ.  సాయుధ బలగాలకు అంటే ఇండియన్ ఆర్మీ,ఇండియన్ ఎయిర్ ఫోర్స్,ఇండియన్ నేవీ, డీ ఆర్ డీ ఓ కు ఇంజనీరింగ్ సపోర్ట్ అందిస్తుంది.


అంతేకాకుండా భారత్ ఆర్మీ లో సేవలందించాలనుకునేవారికి  ఇది కూడా ఓ మంచి అవకాశమే. సైన్యంలో కాకుండా ఇలాంటి సంస్థలలో  చేరడం ద్వారా సాయుధ బలగాలకు సేవలు అందించవచ్చు. దేశానికి సేవలు అందించిన వాళ్లను ఎప్పుడైనా పొగుడుతూ ఉన్నప్పుడు మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి.. ఆ సమయంలో మనం కూడా దేశానికి ఏదో ఒక సాయం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాము.. కేవలం పొగడ్త కోసం మాత్రమే కాకుండా మనస్ఫూర్తిగా దేశానికి సేవ చేయగలగాలి.. అప్పుడే మన దేశంలో ఉన్న మనం తీర్చుకున్న వారమవుతాం.. కాబట్టి ఫ్రెండ్స్  ఎవరైతే సాయుధ బలగాల లో ఉద్యోగం సాధించాలని అనుకుంటున్నారో అలాంటి వారికి ఇది ఒక సువర్ణ అవకాశం...

మరింత సమాచారం తెలుసుకోండి: