పవన్ కళ్యాణ్ సినిమాలో నటించాలని అందరికి ఉంటుంది. కానీ ఆ అవకాశం అంత తొందరగా రాదు. ఇప్పుడు అంతటి అవకాశాన్ని బిగ్ బాస్ బ్యూటీ హిమజ సొంతం చేసుకుంది. అలాగే పవన్ కళ్యాణ్ రాసిన ఒక లెటర్ ను కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆనందాన్ని పంచుకుంది.

ఇక విషయంలోకి వెళ్తే, పవన్ కళ్యాణ్- క్రిష్ కలయిక లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో హిమజ నటించేందుకు ఛాన్స్ కొట్టేసింది.ఈ సందర్బంగా సెట్ లో పవన్ కళ్యాణ్ తో దిగిన ఒక ఫోటో ని తన అభిమానులతో  పంచుకుంది. అలాగే తాను పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తున్నట్లు అనౌన్స్ చేసింది.

అయితే హిమజ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక లెటర్ ని పోస్ట్ చేయగా. ఈ లెటర్ పై కొంత అనుమానంగా వచ్చిన  హిమజ దానిపై అంతగా స్పందించలేదు. హిమజ పోస్ట్ చేసిన లెటర్ చూస్తే  "హిమజ గారికి అంత మంచే జరగాలని, మున్ముందు ఇంకా మంచి సినిమాలు చేయాలనీ కోరుకుంటున్నానని" అని రాసి  కింద పవన్ కళ్యాణ్ అని సైన్ చేసి ఉంది. అయితే ఈ లెటర్ పై అనుమానం ఎందుకు వచ్చిందంటే ఈ పదాలన్ని ఒక చిన్న పేపర్ ముక్క పై రాసి ఉండడం చూసి నెటిజన్లు అనుమానం పడుతున్నారు. కానీ హిమజ వాటినన్నింటిని తిప్పి కొట్టింది. తన సోషల్ మీడియా సాక్షిగా షేర్ చేయగా ఈ లెటర్ లో అనుమానం ఎందుకని తెలిపింది.

పవన్ కళ్యాణ్ ఆలా రాసి ఇవ్వడం పై హిమజ తెగ ఆనందపడుతుంది. పవన్ కళ్యాణ్ ని సినిమాలలో చూడటమే తప్పించి నిజంగా కలుస్తానా అని అనుకున్నానని, ఇప్పుడు ఏకంగా అతని సినిమాల్లోనే నటిస్తున్నానంటే ఇది కలనా లేక నిజామా అని తన సంతోషాన్ని ఈ విధంగా తెలుపుతుంది.

ఇక హిమజ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లో కొనసాగుతుంది. పలు రామ్ పోతినేని సినిమాలలో హీరోయిన్ పక్కన ఫ్రెండ్ పాత్రల్లో నటించింది . అలాగే బిగ్ బాస్ సీజన్ త్రీ లో కూడా మెరిసింది. పవన్ కళ్యాణ్ చెప్పినట్లు హిమజ కి ఇంకా మంచి అవకాశాలు రావాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: