రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ హీరో చేతిలో ఉన్న అన్ని సినిమాలు కూడా పాన్ ఇండియా మూవీలే కావడం విశేషం. వాటిని ఒక్కోటిగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు రెబల్ స్టార్. అయితే చాలా మంది హీరోలంతా తమ సినిమాను సంక్రాంతి బరిలో దింపేందుకు ఖర్చీఫ్ కూడా వేసారు. ఇందులో డార్లింగ్ నటిస్తున్న ‘సలార్’ సినిమాను కూడా వచ్చే సంక్రాంతి బరిలోనే నిలుపుతున్నట్టు వార్తలు వచ్చాయి. సంక్రాంతి బరిలో దించి మాంచి వసూళ్లు రాబడదామని దర్శక నిర్మాతలు ప్రశాంత్ నీల్, కిరంగదూర్ ప్లాన్స్ వేశారట. కానీ సడెన్ గా పవన్ కళ్యాణ్, క్రిష్ ల యూనిట్ సంక్రాంతిలో బరిలో తమ సినిమా ఉండదని ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.
ఇక ఆ తర్వాత సలార్ సస్పెన్స్ ను మెయిన్ టెయిన్ చేస్తూ వచ్చింది. ఇక ఆ సస్పెన్స్ కు ప్రస్తుతం తెరదించింది. తాజాగా ఈ ‘సలార్’రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ సమ్మర్ కు మార్చేసింది. ఈ అనూహ్య నిర్ణయం పట్ల ప్రభాస్ అభిమానుల్లో, ఇటు పవన్ ఫ్యాన్స్ లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. రెండు భారీ సినిమాలు ఓకే టైం లో రిలీజ్ కాకూడనే ఈ నిర్ణయం తీసుకున్నారా వీళ్లు అంటూ ఫ్యాన్స్ గుసగుసలాడుతున్నారు. అయితే ఇదంతా ఆకస్మికంగా జరిగిందే.. క్రిష్ డైరెక్షన్ లో పవన్ నటిస్తున్న సినిమాను సంక్రాంతి బరిలో దింపుతున్నామని.. పీఎస్ పీకే యూనిట్ ట్రేడ్ కు సమాచారం ఇచ్చిందట.

ఆ తర్వాతే ఈ సినిమా టైటిల్ ఖరారును, పోస్టర్ ను మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. ఆ తర్వాత సలార్ యూనిట్ సంక్రాతి కానుకగా కాకుండా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మార్చుకుని సమ్మర్ కు షిఫ్ట్ అయ్యిందట. అయితే సంక్రాంతి బరిలో పవన్ దిగబోతున్నాడన్న విషయం తెలిసాకా.. సాలార్ ను ఫిబ్రవరి 28 న రిలీజ్ చేద్దామని ఈ చిత్ర యూనిట్ భావించారట. కానీ పోటీ వద్దనుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. అలాగే అనేక డైలమాల మధ్యన ఈ సినిమా రిలీజ్ ను సమ్మర్ తీసుకెళ్లారని సమాచారం. ఇంకో విషయం ఏమిటంటే ఇప్పటికే సంక్రాంతి బరిలోనే సూపర్ స్టార్ నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ దిగబోతోంది. ఇక సూపర్ స్టార్ మహేశ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల మధ్యన సంక్రాంతి పోరు ఏర్పడనుందని అర్థమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: