తొలిప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ కి పెదనాన్న క్యారెక్టర్ లో నటించిన నగేష్ మీ అందరికి గుర్తు ఉండే ఉంటాడు. తొలిప్రేమ సినిమా విజయం వెనుక నరేష్ పాత్ర కుడా కీలకం అనే చెప్పాలి. చాలా సినిమాల్లో నగేష్ కమెడియన్ గా కూడా నటించాడు. పలు తమిళ, తెలుగు, మలయాళ చిత్రాలలో నటించాడు. అలాగే ఎన్నో సినిమాల్లో నటి మనోరమతో కలిసి  జోడిగా వందల సినిమాల్లో నటించాడు. నగేష్ కి మంచి పేరు తెచ్చిన సినిమా సర్వర్ సుందరం. ఈ సినిమా వలన ఆయనకి ఎంతో మంచి గుర్తింపు వచ్చిందనే చెప్పాలి. నగేష్ ప్రముఖ నటులు అయిన కమల్ హాసన్, ఎన్టీఆర్, ఎంజీఆర్ వంటి అందరి హీరోలతో  కలిసి నటించారు.నగేష్ చివరగా కమల్ హాసన్ నటించిన దశావతారం సినిమాలో మనకు కనిపిస్తారు.


ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నగేష్ జీవితంలో ఒక విషాద ఘటన జరిగింది. ఆ సంఘటన ఆయన్ని బ్రతికి ఉన్నంత కాలం కలవరపెడుతూనే ఉంది. ఆయన సినిమాల్లో బాగా రాణించే సమయంలో ఎంతో విలాసవంతమైన  ఖరీదైన కారును కొన్నారు. ఆ కారులో నగేష్ వాళ్ళ అమ్మని ఎక్కించుకొని ఊరంతా తిప్పి చూపించే క్రమములో నగేష్ తల్లి ఆనందం తట్టుకోలేక కారులోనే హట్టాతుగా కన్ను మూసారు.ఈ ఘటనతో నగేష్ మానసిగాకంగా ఎంతో క్రుంగి పోయారు. తేరుకోవడానికి చాలా సమయమే పట్టిందనే చెప్పాలి. ఇకపోతే నగేష్ వ్యక్తిగత విషయానికి వస్తే మంచి విలక్షణ నటుడిగా సినీ రంగంలో సెటిల్  అయ్యాక రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెట్టి, ఒక థియేటర్ ని కూడా నిర్మించాడు నగేష్.


అప్పట్లో ఎమ్జీఆర్ తో సినిమా పరంగా కొన్ని బేదాభిప్రాయాలు రావడంతో నగేష్ కి అనుకోని కష్టాలు వచ్చి పడ్డాయట. ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఒక పక్క వ్యాపారాలు కూడా దెబ్బ తిన్నాయి. మళ్ళీ కొన్నాళ్ళకి వ్యాపారంలో పుంజుకున్నాడు.ఎంజీఆర్ పై ఉన్న  కోపం తో పన్నులు కట్టకపోవడంతో  జైలు కి సైతం వెళ్లారు అని తమిళ సినీ వర్గాలు అంటూ ఉంటారు. ఇక నగేష్ కి రమేష్ బాబు మరియు ఆనంద్ బాబు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వాళ్లలో ఆనంద్ నటుడిగా స్థిరపడ్డాడు. 2009 వ సంవత్సరంలో  అనారోగ్య కారణాల చేత చెన్నైలోని ఆయన స్వగృహంలో కన్ను మూసారు

మరింత సమాచారం తెలుసుకోండి: