ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమా రిలీజ్ లకు సంబంధించి ట్రెండ్ మారిందనే చెప్పాలి.. ఓ సినిమా విడుదలవ్వక ముందే భారీ లాభాలను మూటగట్టుకుంటున్నారు మన నిర్మాతలు.. రిలీజ్ కు ముందే డీజిటల్ ఓటీటీ , శాటిలైట్ రైట్స్ రూపంలో కూడా సినిమాలు భారీ స్థాయిలో లాభాలు అందుకుంటున్నాయి. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ కు సంబంధించిన హక్కులపై కూడా అనేక రకాల గాసిప్స్ పూట్టుకొస్తున్నాయి.వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమా పింక్ సినిమాకి రీమేక్ అని అందరికి తెలిసిన విషయమే. దిల్ రాజు, బోణి కపూర్ తెలుగులో సంయుక్తంగా నిర్మించారు.

అయితే ఒక రీమేక్ సినిమాకు ఎవరు ఊహించని రేంజ్ లో నాన్ థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు టాక్ వస్తోంది.ఇక వాళ్ళ డీలింగ్స్ ఎలా కొనసాగయో తెలియదు గాని సినిమా డిజిటల్, శాటిలైట్. హక్కుల ద్వారా మొత్తంగా 50కోట్ల రూపాయల వరకు లాభాలను అందించినట్లు సమాచారం. అంటే దాదాపు పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ తో సమానమని మరొక టాక్ కూడా వైరల్ గా మారింది. చూస్తుంటే పవర్ స్టార్ బాక్సాఫీస్ వద్ద పవర్ఫుల్ హిట్ అందుకునేలా ఉన్నాడని అనిపిస్తోంది. గత సినిమాల ప్రభావం కూడా ఏమి కనిపించడం లేదు..

అజ్ఞాత వాసి సినిమా తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత పవన్ ఈ మూవీతో రావడం.. అదికూడా సమ్మర్ సీజన్లో సినిమా విడుదల అవుతుండడంతో కచ్చితంగా ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోందని ధీమా వ్యక్తం చేస్తున్నారు దర్శకనిర్మాతలు..ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది..  ఏప్రిల్ 9న విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మార్చి నెలలో మొదలు కానున్నాయని లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: