యూట్యూబ్‌లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న షణ్ముక్..తాజాగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు పట్టుబట్ట సంగతి తెలిసిందే..మద్యం మత్తులో కారు నడుపుతూ మూడు వాహనాలను ఢీకొట్టడమే కాకుండా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో తనకు యూట్యూబ్‌లో వీర ఫాలోయింగ్ ఉందన్న రేంజ్‌లో షణ్ముక్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. 'నా ఒక్కో ఎపిసోడ్‌కు కోటి వ్యూస్ ఉంటాయి తెలుసా' అంటూ దబాయించాడు. ఆ ఒక్కమాటతో షణ్ముక్ అప్పుడు ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నాడో పోలీసులకు అవగతమైంది. అంతేకాదు, పోలీసులకు కొందరితో ఫోన్లు చేయించేందుకు ప్రయత్నించాడు.

పోలీసులు ససేమిరా అనడంతో అంతటితో ఆగకుండా.. డబ్బులిచ్చేందుకు కూడా సిద్ధపడ్డాడు. తాగిన మత్తులో మూడు కార్లను ఢీకొట్టడమే కాకుండా..ఎవరికీ ఏం కాలేదు కద.. ఎవరూ హాస్పిటల్‌లో జాయిన్ అవలేదు కదా' అని షణ్ముక్ ప్రశ్నించడం గమనార్హం. షణ్ముక్ కారు ఢీకొట్టిన ఘటనలో బైక్‌పై వెళుతున్న ఓ వ్యక్తి గాయపడ్డాడు. షణ్ముక్ జశ్వంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి 41(ఏ) నోటీసు జారీ చేశారు.జూబ్లీహిల్స్ రోడ్ నెం.52లోని ఉడ్స్ అపార్ట్‌మెంట్స్ నుంచి తన కారులో మద్యం మత్తులో వేగంగా వచ్చిన షణ్ముక్ జశ్వంత్ ఎదురుగా ఉన్న వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లాడు.

స్థానికులు షణ్ముక్ కారును అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. విజయ్ అనే వ్యక్తికి చెందిన కారు ఈ ఘటనలో దెబ్బతినడంతో షణ్ముక్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో.. షణ్ముక్‌పై ఐపీసీ సెక్షన్ 337, 279 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. షణ్ముక్ ఇటీవల తన యూట్యూబ్ ఛానల్‌లో విడుదల చేసిన 'సాఫ్ట్‌వేర్ డెవలపర్'కు యూత్ నుంచి మంచి స్పందన వచ్చింది.కోట్లలో వ్యూస్ రావడంతో అదే తరహాలో 'సూర్య' అనే మరో వెబ్ సిరీస్‌ను కూడా షణ్ముక్ విడుదల చేశాడు. ఈ వెబ్ సిరీస్‌కు కూడా మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడం విశేషం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: