రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా తన స్టార్ డం ను అమాంతం పెంచుకున్న రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే..ఈ విషయం పక్కన పెడితే మన డార్లింగ్ పెళ్లి చేసుకునేది ఎప్పుడు.?అనే ప్రశ్న మాత్రం చాలా సంవత్సరాల నుండి అభిమానుల్లో మెదులుతోంది.. ఇప్పుడే కాదు ప్రభాస్ పెళ్ళి విషయం ఎప్పడు హాట్ టాఫికే. ప్రభాస్ పెళ్లి ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని అభిమానులు కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. తాజాగా రెబల్ స్టార్ పెళ్ళి విషయంపై ఓ క్లారిటి వచ్చింది.

ఆయన ఈ ఏడాదిలో పెళ్ళి చేసుకొబోతున్నట్లు సమాచారం. ఈ వివాహంతో తన మ్యారేజ్‌పై నిరంతరం వచ్చే పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టాలి చూస్తున్నాడు. తన సమీప బంధువు కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రభాస్ వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ అమ్మాయి అమెరికాలో ఉందని.. ఇటీవలే ఎమ్మెఎస్ కంప్లీట్ చేసినట్లుగా సమాచారం. ఆ యువతి వయసు 25 ఏళ్లని.. మే నెలలో ఆ ఆమ్మాయితో ప్రభాస్‌కు ఎంగెజ్‌మెంట్ జరగనుందని సమీప బంధువు ద్వారా తెలిసింది.

అయితే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పెళ్ళి వార్త చెబుతాడని అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు భావించారు. ఆ తర్వాత తూచ్ అంటూ ప్రభాస్.. పెళ్లి మాటే మర్చిపోయి.. 'సాహో' సినిమా చేసాడు.ఇప్పటికే ప్రభాస్ పెళ్లిపై అదే సస్పెన్స్ కొనసాగుతుంది. ఇక ప్రభాస్.. అనుష్కను వివాహాం చేసుకోబోతున్నాడనే వార్తలు కూడా వెలుబడ్డాయి..కానీ ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.. ఇక ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమాలో నటిస్తున్న ప్రభాస్.. కొద్ది రోజుల క్రితం సలార్ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.. ఏప్రిల్ 14 2022న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సాలార్ సినిమా రిలీజ్ కానుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: