టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ కి ఇటీవలే విడుదలైన నాంది అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ దక్కిన విషయం తెలిసిందే.. అల్లరి నరేష్ హీరోగా హిట్ అందుకొని దాదాపు ఎనిమిదేళ్ల సమయం పట్టింది.. అన్ని సంవత్సరాలు హీరోగా ఇండ్రస్టీ లో నిలద్రొక్కుకోవడానికి అల్లరి నరేష్ విశ్వ ప్రయత్నాలు చేసాడు..ఎప్పుడు ఒకే తరహా సినిమాలు చేసే ఈ హీరో.. ఈసారి తన పంథా మార్చి.. చివరికి ఎనిమిదేళ్ళ తర్వాత ఓ ప్రయోగాత్మక సినిమాతో హిట్ కొట్టి తానేంటో నిరూపించుకున్నాడు..ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ నటనకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..

 అంతలా ఈసినిమాలో ఒదిగిపోయే నటనతో అందరిని ఆకట్టుకున్నాడు ఈ అల్లరోడు..ఇక ప్రస్తుతం ప్రేక్షకులతో పాటు.. ఇండ్రస్టీ లోని పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.. అందులో భాగంగానే టాలీవుడ్‌ నేచురల్‌ స్టార్‌ నానీ పొగడ‍్తల్లో ముంచెత్తారు. భవిష్యత్తంతా బంగారుబాటే అన్న సంకేతాలిస్తూ.. నరేష్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ మేరకు నాని ట్వీట్ చేస్తూ.. "మొత్తానికి 'నాంది' సినిమా చూశాను. రేయ్‌ రేయ్‌ రేయ్‌.. 'అల్లరి నరేష్‌' పేరు మార్చేయ్‌ ఇంక.. అల్లరి గతం.. భవిష్యత్తుకు ఇది నాంది.

ఒక గొప్ప నటుడిని నీలో చూశాను.చాలా సంతోషంగా ఉంది. ఇకపై ఇలాంటివి నీ నుంచి మరిన్ని రావాలని కోరు కుంటున్నాను.." అని నాని పోస్ట్ చేశారు. దీంతో అభిమానుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. కాగా గమ్యం సినిమాలోని గాలి శ్రీను క్యారెక్టర్‌తో తన నటనను మరింత ఎత్తుకు తీసుకెళ్లిన అల్లరి నరేష్‌ తాజా చిత్రం నాంది. ఎస్వీ 2 ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సతీష్ వేగేశ్న నిర్మించిన నాంది మూవీ హిట్‌టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే హీరో నాని చేసిన ట్వీట్ ఇపుడు వైరల్‌గా మారింది.ఇలాంటి మరెన్నో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని తప్పకుండా ఫాలో అవ్వండి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: