ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. తెలుగు టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం ‘నాంది’.. ఈ మధ్య విడుదల అయ్యి మంచి టాక్ ని సొంతం చేసుకోని డీసెంట్ రన్ ను కొనసాగిస్తుంది. ఫిబ్రవరి 19న విడుదలైన ఈ చిత్రం అల్లరి నరేష్ కు మంచి విజయాన్ని ఇంకా నటుడిగా మంచి గుర్తింపుని అందించింది. 9 ఏళ్లుగా వరుస ప్లాపులు ఎదుర్కొని సరైన హిట్టుకోసం ఎదురుచూస్తున్న నరేష్ కు ఈ చిత్రం మంచి విజయాన్ని ఇచ్చి ఆ లోటుని తీర్చి.. అతన్ని ప్లాపుల నుండీ బయటపడేసింది. విజయ్ కనకమేడల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘ఎస్.వి.2 ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై సతీష్ వేగేశ్న నిర్మించాడు. ఇప్పటివరకూ కామెడీ హీరోగానే రాణిస్తూ వచ్చిన నరేష్.. ఈసారి కంప్లీట్ సీరియస్ రోల్ ప్లే చేసిన చిత్రమిది."నేను", "గమ్యం", "శంభో శివ శంభో","మహర్షి" సినిమాల తరువాత మంచి నటుడిగా ఈ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది...అల్లరి నరేష్ కెరీర్ లోనే ఎప్పటికి గుర్తుండిపోయే సినిమా అవుతుంది నాంది...


ఇక నాంది సినిమా 10 రోజుల వసూళ్ల విషయానికి వస్తే...‘నాంది’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.2.7కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.2కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజులకే ఆ టార్గెట్ ను పూర్తిచేసింది ఈ చిత్రం. ఇక 10 రోజులు పూర్తయ్యేసరికి 4.43 కోట్ల షేర్ ను రాబట్టి డీసెంట్ రన్ కొనసాగిస్తుంది. సెకండ్ వీకెండ్ కూడా పర్వాలేదు అనిపించింది ఈ చిత్రం.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ అలాగే వసూళ్ల వివరాలు కోసం ఇంకా మరెన్నో వివరాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: