ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...టాలీవుడ్ యంగ్ హీరో యూత్‌ స్టార్‌ నితిన్‌ గతేడాది "భీష్మ " సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇక ఆ సినిమా తరువాత ఎన్నో అంచనాలతో హీరోగా నటించిన చిత్రం "చెక్ "..తెలుగు ఇండస్ట్రీ లో "ఒక్కడున్నాడు" లాంటి మాస్టర్ పీస్ మూవీని తెరాకెక్కించి క్రియేటివ్ దర్శకుడిగా పేరు సంపాదించిన దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో ‘భవ్య క్రియేషన్స్’‌ బ్యానర్ పై వి. ఆనందప్రసాద్‌ నిర్మించిన చిత్రం ‘చెక్‌’. ఈ చిత్రంలో హాట్ బ్యూటీస్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ వంటి క్రేజీ భామలు హీరోయిన్లుగా నటించారు.రకుల్ ప్రీత్ సింగ్ చాలా రోజుల తరువాత నటించిన తెలుగు సినిమా ఇది. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 26న భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి…మొదటి షో నుండే డీసెంట్ అనే టాక్ వచ్చినప్పటికీ దానిని క్యాష్ చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యింది. బాక్స్ ఆఫీస్ వద్ద చతికాల పడింది.


ఇక యూత్ స్టార్ నితిన్ నటించిన చెక్ మూడు రోజుల్లో ఎంత రాబట్టిందంటే...‘చెక్’ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.16.10కోట్ల బిజినెస్ జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు రూ.16.60 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం 7.66 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 8.94 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. చెప్పాలంటే ఇవి డీసెంట్ ఓపెనింగ్స్ అయినప్పటికీ.. టార్గెట్ పెద్దది కాబట్టి..ఇక ‘చెక్’ బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమనే చెప్పాలి.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ ఇంకా వసూళ్ల గురించి తెలుసుకోడానికి ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: