చాలా సంవత్సరాల క్రితం వచ్చిన మలయాళం దృశ్యం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాని చాలా భాషల్లో అదే పేరుతో రీమేక్ చేశారు.  తెలుగులో కూడా విక్టరీ వెంకటేష్ ఈ సినిమాని రీమేక్ చేసి మంచి సూపర్ హిట్ కొట్టాడు. అయితే ఈ సినిమాకి చాలా సంవత్సరాల తర్వాత సీక్వెల్ వచ్చింది అదే దృశ్యం2. ఈ సినిమాలో కూడా మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలలో కనిపించారు.  ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో విడుదల కావడంతో చాలా మంది ఈ సినిమాని ఇప్పటికే చేసేసారు. ఈ సినిమా కి మంచి టాక్ రావడంతో అందరూ అమెజాన్ ప్రైమ్ లో చూసారు. ఇక ఈ సినిమా తెలుగులో కూడా మళ్లీ రీమేక్ చేయడంతో ఈ సినిమా పైన చాలా సందేహాలు ఉన్నాయి.కాకపోతే అమెజాన్ ప్రైమ్ మలయాళం సినిమాని తెలుగులోకి డబ్బింగ్ చేసి ప్రైమ్ విడుదల చేయబోతుంది  అని టాక్. దీనికి కారణం మలయాళం లో టాప్ హీరో అయిన మోహన్ లాల్ గారు ఇప్పుడు తెలుగు వాళ్లకు కూడా మంచి సుపరిచితమే .జూనియర్ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్, చంద్రశేఖర్ ఏలేటి దర్శకుడితో మనమంతా లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఆయన చాలా దగ్గరయ్యాడు. అందువల్ల ఈ సినిమాని ప్రత్యేకంగా రీమిక్ చేయడం ఎందుకని అందరూ అనుకుంటున్నారు.ఇక ఈ తెలుగు సినిమా దృశ్యం 2 షూటింగ్ ఈరోజు మొదలయ్యింది. ఈ సినిమాలో మోహన్ లాల్ పాత్ర తప్ప అన్ని మలయాళం సినిమాలోని పాత్రలు ఉంటాయి అని టాక్ అయితే ఈ సినిమా కూడా మొదటి సినిమాలాగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో లేదో తెలియాలంటే  ఆగాల్సిందే. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే రెగులర్ గా మొదలుకాబోతుంది. ఇక ఈ సినిమాని కూడా ఒరిజినల్ సినిమా డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: