ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..."జబర్దస్త్" షోకి ఎంత క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆరాదించే షో..తెలుగు టీవీ ఛానల్స్‌లో జబర్దస్త్‌ క్రేజ్‌ను కొట్టడానికి చాలా షోలు వచ్చాయి.. కాని ఏవి కొట్టలేకపోయాయి. ఎంతో ప్రయత్నించాయి కాని జబర్దస్త్ ని బీట్ చెయ్యలేకపోయాయి.ఇక ‘అదిరింది’, ‘బొమ్మ అదిరింది’ దుకాణాలు మూసేశాక.. మరో ఛానల్‌లో ‘కామెడీ స్టార్స్‌’ అనే కార్యక్రమం మొదలైంది. ఇప్పటివరకు టెలీకాస్ట్‌ అయిన ఎపిసోడ్స్‌కి మంచి రేటింగే వచ్చింది అంటున్నారు.సరే ఆ విషయం పక్కన పెట్టేసి అసలు విషయానికి వస్తే అందులో యాంకర్‌ గా నటించిన పిల్ల ప్రస్తుతం ఆదరగోడుతుంది. అవును ‘కామెడీ స్టార్స్‌’ యాంకర్‌ వర్షిణి గురించే ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తుంది...

ఇక జబర్దస్త్ అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం "రష్మీ","అనసూయ" హాట్ హాట్ అందాలు అని కూడా చెప్పుకోవచ్చు. యూత్ లో వాళ్ళకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు.ఇన్నాళ్లుగా చాలామంది యాంకర్లు వస్తున్నా.. వీరికి అంతగా పోటీ ఇవ్వలేదనే చెప్పాలి. యాంకరింగ్‌లో కాదు హాట్‌నెస్‌లో. అయితే ఇప్పుడు వర్షిణి రూపంలో పోటీ వచ్చింది అంటున్నారు టీవీ జనాలు. ‘కామెడీ స్టార్స్‌’ కోసం వర్షిణి చాలా అందంగా తయారై వస్తోంది. హాట్‌ మూమెంట్స్‌తో కుర్రకారు మతుల్ని పోగొడుతోంది.వర్షిణి ఎంచుకున్న దారి కొత్తేం కాదు. తొలినాళ్లలో అనసూయ, తర్వాత రష్మి చేసిన పని ఇదే. మధ్యలో శ్రీముఖి వచ్చినా… ఈ మోతాదు హాట్‌నెస్‌ చూపించినా… బొద్దుతనం దానిని కవర్‌ చేసేసింది.

ఇప్పుడు వర్షిణిలో హాట్‌నెస్‌నే చూస్తున్నారు కుర్రకారు. ఓసారి జబర్దస్త్‌కు యాంకరింగ్‌ చేసిన అనుభవం, మరో రెండు షోలు చేసిన అనుభవం మొత్తం రంగరించి హాట్‌నెస్‌ అలెర్ట్‌ ఇస్తోంది. చూడాలి ఇక వర్షిణి ఈ షోతో ఇంకెంత అందం ఒలకబోసి సందడి చేస్తుందో.ఇంకా ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: