వరలక్ష్మీ శరత్ కుమార్, అందమైన విలన్. మేల్ డామినేషన్ ఉన్న సినీ ఫీల్డ్ లో లేడీస్ విలన్ గా రాణించడం అంటే చాలా  కష్టమే. కానీ అటువంటిదేదీ లేకుండా కేవలం తన టాలెంట్ తో టాలీవుడ్ తెర నిండా పరచుకున్న కొత్త ఆడ శత్రువు ఆమె. ఆమెకు తెలుగులో వరసగా సక్సెస్ అందుతోంది. దాంతో పాటే ఆమె డిమాండ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోతోంది.

జనవరి నెలలో రవితేజా క్రాక్ సినిమాతో క్రాకెత్తించే హిట్ ని సొంతం చేసుకున్న వరలక్ష్మి ఫిబ్రవరిలో  నాంది మూవీతో అల్లరి నరేష్ సినిమా హిట్ లో తనకు భాగం ఉంది అనిపించుకున్నారు. ఆమె ఇపుడు తెలుగులో బిజీ ఆర్టిస్ట్ గా మారుతున్నారు. ఆమె కోసం ఎన్నో పాత్రలను రచయితలు రాస్తున్నారు అంటేనే ఆమె టాలెంట్ ఏంటో తెలుస్తుంది. రచయితలు ఒక ఆర్టిస్ట్ ని దృష్టిలో ఉంచుకుని రాయడం మొదలుపెట్టారు అంటేనే అవతల వారేటో అన్నది చెప్పేయవచ్చు. ఇప్పటిదాకా అలా మేల్ ఆర్టిస్టులను, వారి మ్యానరిజాన్ని ఊహించుకుని పాత్రలకు ప్రాణం పోసిన రచయితలు, దర్శకులు ఇపుడు వరలక్షి మీద కూడా ఫోకస్ పెట్టారు. ఒక సినిమా హిట్ లో ఆమె పాత్ర కూడా చాలా ఉందని గ్రహించడం వల్లనే ఇలా టాలెంట్ కి దాసోహం అంటున్నారు అనుకోవాలి

ఇదిలా ఉంటే ఎన్నో పాత్రలు ఇపుడు వరలక్ష్మి శరత్ కుమార్ ని వరించి వస్తున్నాయి. అందులో ఒకటి టాప్ డైరెక్టర్ కొరటాల శివ, అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో వస్తున్న మూవీలో వరలక్ష్మి కూడా కీలకమైన పాత్రలో కనిపిస్తుందిట. ఈ మూవీలో అల్లు అర్జున్ విద్యార్ధి నాయకుడిగా కనిపిస్తున్న సంగతి విధితమే. ఆయనకు ఆపోజిట్ గా వరలక్ష్మి పాత్ర ఉంటుంది అంటున్నారు. మొత్తానికి చూస్తే ఈ అమ్మడు తెలుగులో మరిన్ని పవర్ ఫుల్ రోల్స్ తో అదరగొట్టేలాగే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: