ప్రస్తుతం టాలీవుడ్ కి ఎంతో మంచి కళ వచ్చిందనే చెప్పాలి. ఈ ఏడాది ప్రారంభం నుండి విడుదల అవుతున్న సినిమాల్లో కొన్ని భారీ విజయాలు అందుకుంటూ నిర్మాతలు, బయ్యర్లకు కాసులు కురిపిస్తున్నాయి. అలానే ఈ ఏడాది పలు భారీ పాన్ ఇండియా సినిమాలు వరుసగా ఒకదాని వెంట మరొకటి కొద్దిపాటి గ్యాప్ లో రిలీజ్ కానుండడంతో మన దేశంతో పాటు పలు ఇతర దేశాల ప్రేక్షకుల్లో కూడా వాటిపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ముందుగా వాటిలో జులై 16న ప్రపంచవ్యాప్తంగా కెజిఎఫ్ చాప్టర్ 2 సినిమా రిలీజ్ కానుంది.

రెండేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి అతి పెద్ద విజయాన్ని అందుకున్న పాన్ ఇండియా మూవీ కెజిఎఫ్ చాప్టర్ 1 కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరోగా యష్ నటిస్తుండగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. కోలార్ గనుల నేపథ్యంలో అత్యంత భారీ మాస్, యాక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకడు. దాదాపుగా రూ.300 కోట్లకు పైగా భారీ వ్యయంతో ఈ మూవీ రూపొందుతోంది. అలానే ఆ తరువాత జులై 30న ప్రభాస్, రాధాకృష్ణ కుమార్ ల కలయికలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ మూవీ రిలీజ్ కానుంది. యువి క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్న ఈ మూవీలో పూజ హెగ్డే హీరోయిన్. సాహో తరువాత చాలా గ్యాప్ అనంతరం వస్తున్న పాన్ ఇండియా మూవీ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. 

దాని తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ ల కలయికలో తెరక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప ఆగష్టు 13న రిలీజ్ కానుంది. అలవైకుంఠపురములో వంటి సూపర్ హిట్ తరువాత వస్తున్న మూవీ కావడంతో బన్నీ ఫ్యాన్స్ తోపాటు మిగతా ఆడియన్స్ కూడా ఈ మూవీ సక్సెస్ పై ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు. దాని తరువాత సెప్టెంబర్ 9న విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ ల కలయికలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ లైగర్ రిలీజ్ కానుంది. మంచి యాక్షన్ బేస్డ్ మూవీ గా తెరక్కుతున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. 

ఇక అక్టోబర్ 13న తొలిసారిగా ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ విడుదల కానుంది. బాహుబలి రెండు భాగాల తరువాత రాజమౌళి తీస్తున్న మూవీ కావడంతో దీనిపై అందరిలో ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి. అయితే వీటిలో మెజారిటీ ప్రేక్షకుల యొక్క దృష్టి మాత్రం కెజిఎఫ్ - 2, అలానే ఆర్ఆర్ఆర్ సినిమాలపైనే ఉందని, ఇవి రెండూ ప్రస్తుతం అత్యంత భారీ స్థాయిలో ప్రీ బిజినెస్ ఆఫర్స్ దక్కించుకుంటున్నాయని, అయితే ఫైనల్ గా మాత్రం ఈ ఐదు భారీ ఇండియా సినిమాల్లో ఎవరు విజేతగా నిలిచేది తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే అని అంటున్నారు విశ్లేషకులు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: