కొరటాల శివ ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య నిర్మితమవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే రిలీజ్ కాగా, సినిమా పై అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది ఆ మోషన్ పోస్టర్.. కొరటాల శివ స్టైల్ లో మెసేజ్ ఓరియెంటెడ్ కమ్ కమర్షియల్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది..మామూలుగానే మెగాస్టార్ సినిమా అంటే ఆ క్రేజ్ వేరే లెవల్లో ఉంటుంది. అందునా కొరటాల శివ డైరెక్షన్ అనడంతో ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు.

హీరోయిన్ గా కాజల్ నటిస్తుండగా తొలిసారి కొరటాల శివ దేవి శ్రీ ప్రసాద్ ని కాదని మణిశర్మ తో ఈ సినిమా చేస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రామ్ చరణ్ - నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంతేకాకుండా రామ్ చరణ్ తేజ్  కూడా ఓ ముఖ్యమైన పాత్రలో చేస్తున్న సంగతి తెలిసిందే.. సిద్ద అనే పాత్రలో రామ్ చరణ్ ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తుండటం అభిమానులకు మంచి కిక్ ఇస్తోంది.

గతంలో చిరు, చరణ్ కలిసి నటించినప్పటికీ కథ పరంగా కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. అందుకే అందరిలోనూ ఇంత ఎగ్జైట్మెంట్. ఇక సినిమాలో చరణ్ లుక్ ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ కూడ నెలకొని ఉంది. ఈ విషయమై కొరటాల శివ కొద్దిసేపటి క్రితమే ఒక హింట్ ఇచ్చారు. చరణ్ స్టైల్ ఒక ధనాన్ని రిలీజ్ చేసి ఆచార్య ‘సిద్ద’మవుతున్నాడు అన్నారు. దీన్నిబట్టి మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా ఆయన ఫస్ట్ లుక్ విడుదలచేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. సో.. మెగా అభిమానులకు మార్చి 27న పెద్ద పండుగే. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే 13న వేసవి కానుకగా రిలీజ్ చేస్తున్నారు.తిరు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.ఇక ఈ సినిమా తో పాటు రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో rrr అనే సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ మరో కథానాయకుడు. 2022 లో ఈ సినిమా ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: