సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరో గా రాబోతున్న సినిమా పుష్ప..  టాలీవుడ్ లో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న సుకుమార్ రంగస్థలం లాంటి క్లీన్ కమర్షియల్  హిట్ తర్వాత చేస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.. అల్లు అర్జున్ సుకుమార్ కాంబో వస్తున్న మూడో సినిమా అయినా పుష్ప  పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.. ఇప్పటికే వీరి కాంబో లో ఆర్య, ఆర్య 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. దీంతో మూడో సినిమాపై సహజంగానే అంచనాలు ఉంటాయి.. ఈ చిత్రం లో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నారు. ఎర్ర చందనం, స్మగ్లింగ్, నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ  సినిమా లో నటించే విలన్ పాత్ర కు ఎవరిని నటింపచేస్తున్నారో అన్నది సస్పెన్స్ గా ఉంచుతున్నారు.. మొదటి నుంచి రకరకాల పేర్లు వినిపిస్తున్న ఇప్పటికే ఎవరిని ఫైనల్ చేయలేదు.. ఎవరిని ఫైనల్ చేయలేదా చేసి దాస్తున్నారా అన్న విషయం అర్థం కావట్లేదు.. మన తెలుగు సినిమా లో కథానాయకుడు ఎలా ఉన్నా పర్వాలేదు కాని ప్రతినాయకుడు మాత్రం ఓ రేంజ్ లో ఉండాలి. ఆర్య ని ఫైనల్ చేశామని అంటున్నారు.. అల్లు అర్జున్ సైతం ఈ చిత్రం లో ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్నారు. అయితే ఇప్పటికే విడుదల అయిన పోస్టర్లు, లీక్డ్ వీడియో లు సినిమా పై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ఇక ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ పై సోషల్ మీడియా లో విస్తృతం గా చర్చ జరుగుతుంది. ఈ చిత్ర టీజర్ ను అల్లు అర్జున్ అభిమానుల కోసం, అల్లు అర్జున్ పుట్టిన రోజున విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఏప్రిల్ 8 వ తేదీన అల్లు అర్జున్ పుష్ప టీజర్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడుతున్నారు. రోజుకి మూడు గంటలకు పైగా మేకప్ కోసం కేటాయించడం జరుగుతుంది. లారీ డ్రైవర్ లుక్ కి తగ్గట్టుగా బాడీ షేప్ ను, కలర్ ను మార్చుకుంటున్నారు అల్లు అర్జున్. అయితే ఇప్పటికే 50 శాతం సినిమా షూటింగ్ పూర్తి అయినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: