రాజకీయాలకు బ్రేక్ ఇస్తూ పవన్ కళ్యాణ్ తన రీ ఎంట్రీ లో వకీల్ సాబ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే..  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కి వేణు శ్రీరామ్ దర్శకుడు కాగా ఏప్రిల్ 9 వ తేదీన ఉగాది పండుగ ను పురస్కరించుకొని విడుదల కి సిద్దం కానుంది. బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అయినా ఈ సినిమా ని ఇప్పటికే పలు భాషల్లో  రీమేక్ చేయగా అక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది.. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో కూడా ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి..

అమితాబ్ నటించిన పాత్ర లో పవన్ కళ్యాణ్ నటిస్తుండడంతో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి..కాగా కరోనా లాక్ డౌన్ కొనసాగుతుండగా ఈ చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు భారీ అమౌంట్ తో అమెజాన్ సంస్థ ముందుకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ డైరెక్ట్ ఓటిటి విడుదల చేయబోమని దిల్ రాజు మరియు బోని కపూర్ లు వెల్లడించారు.అయితే ఇప్పుడు అదే అమెజాన్ ఇప్పుడు భారీ అమౌంట్ తో వకీల్ సాబ్ ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం విడుదల అయిన 50 రోజుల తర్వాత ఓటిటీ విడుదల చేయాలనే ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.

మహిళలపై జరిగే లైంగిక వేధింపుల నేపథ్యంలో సాగే కోర్ట్ రూం డ్రామా గా పేరున్న ఈ సినిమా ని పూర్తిగా పవన్ స్టైల్ లో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుండగా అది సినిమా కి ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి. మరొక పక్క పవన్ అయ్యప్పనం కొశియం చిత్రం రీమేక్ లో నటిస్తూనే, క్రిష్ దర్శకత్వంలో మరొక చిత్రం చేస్తున్నారు. అనంతరం గబ్బర్ సింగ్ చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. పవన్ వరుస సినిమాలు చేస్తుండటం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వకీల్ సాబ్ విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: