తెలుగు ప్రేక్షకులకు సీరియల్స్ కీ ఒక మంచి అనుబంధం ఉంది. ఎలా అంటే సీరియల్లో ఆ పాత్రకు కష్టం వస్తే మనకు కష్టం వచ్చినట్లు కన్నీళ్లు పెట్టుకుంటాము. ఇంతలా సీరియల్స్ కి తెలుగు ఆడియన్స్ కీ కనెక్షన్లు ఏర్పడ్డాయి. ఒకప్పటి ఋతురాగాలు సీరియల్ నుండి ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ వరకు అందరిని మన ఇంట్లో మనిషిలా  కలిపేసుకుంటాము. అంతలా మన తెలుగింటి ఆడవాళ్లు సీరియల్స్ లో మునిగిపోతున్నారు.


 ఇక అప్పట్లో వచ్చిన మొగలిరేకులు,చక్రవాకం ఈ సీరియల్స్ గురించి అయితే పెద్దగా చెప్పనవసరం లేదు. ఈ సీరియల్ ఇప్పుడు వచ్చినా చిన్నాపెద్ద అందరూ సీరియల్ కోసం వేచి చూస్తారు అంటే సీరియల్ రేంజ్ ఏంటో మీరు అర్థం చేసుకోండి. చక్రవాకం సీరియల్ లో ప్రేమకథతో అటు పెద్ద వారిని, ఇటు యువతని ఆకట్టుకుంది. ఇక ఈ సీరియల్లో చెప్పుకోవాల్సింది డైరెక్టర్ మంజుల నాయుడు, బిందు నాయుడు.  వీరిద్దరూ ఈ సీరియల్ కథను రాసిన విధానం, తీసిన తీరే ప్రేక్షకులకు చేరువ చేసింది.


 ఇక ఈ సీరియల్ లో నటించిన నటీనటులను అయితే ప్రశంసించకుండా ఉండలేము. అయితే అప్పుడు ఆర్టిస్టులు ఇప్పుడు ఎలా ఉన్నారో చూద్దాం.మేధా చక్రవాకం సీరియల్ తో బుల్లితెరకు పరిచయం అయ్యింది. ఈ సీరియల్ తరువాత మొగలిరేకులు సీరియల్ లో కీర్తన పాత్రలో నటించి అందరి ఆదరాభిమానాలు పొందింది. తర్వాత పెళ్లి చేసుకుని సీరియల్స్ కి దూరమైన మేధా కీ ఇప్పుడు ఒక బాబు కూడా ఉన్నాడు. మీ శ్రేయోభిలాషి సినిమాలో రాజేంద్రప్రసాద్ కు కూతురు గా కూడా నటించింది మేధా.


 ఇక ఈ సీరియల్ లో నటించిన శృతి, సెల్వరాజ్, ఇంద్రనీల్, సాగర్ వీరిని ప్రశంసించకుండా ఉండలేము. ఈ సీరియల్ లో అత్తగా నటించిన మేఘన ని ఇంద్రనీల్ ప్రేమించి ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఇందులో ఇంద్ర, స్రవంతి  ల ప్రేమ లానే, ఇక్బాల్, స్రవంతి ల స్నేహం కూడా ఈ సీరియల్లో అందర్నీ ఆకట్టుకున్న అంశం. ఈ సీరియల్ లో నటించిన సెల్వరాజ్ తరువాత మొగలిరేకులు సీరియల్ లో సెల్వ గా మరింత పేరు తెచ్చుకున్నాడు. ఋతురాగాలు, చక్రవాకం, సీరియల్స్ నుంచి ఇప్పటి వరకు కూడా శృతి సీరియల్స్ చేస్తూనే ఉన్నారు. అప్పటికీ ఇప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు

మరింత సమాచారం తెలుసుకోండి: