సాధారణంగా మనం ఒక నటుడిని చూడగానే వాడు అంతకు ముందు సినిమాలో చేసిన పాత్రను బట్టి కమెడియన్, హీరో, విలన్ ఇలా ఒక అంచనాకు వస్తాం. కానీ ఈయన విషయంలో ఒక నిర్ణయానికి రాలేము. ఎందుకంటే ప్రతినాయకుడిగా భయపడుతూ ఉంటాడు, హాస్యనటుడిగా నవ్విస్తూ ఉంటాడు, క్యారెక్టర్ నటుడిగా భావోద్వేగాలు పంచగలడు. ఆయనలో ఒక కథానాయకుడు ఉన్నాడని సినిమాలు రుజువయింది. ఒక్కో సినిమాలో కొత్త తరహా పాత్రలతో అలరిస్తున్న ఒక అరుదైన నటుడు. ఇంతకీ ఎవరా అనుకుంటున్నారా మన తెలుగు కథానాయకుడు బ్రహ్మాజీ.


 బ్రహ్మాజీ తెలుగు సినిమా హీరోయిన్స్ పై సంచలన కామెంట్ లు  చేశాడు. ఇండస్ట్రీలో కొత్త కథ  ఏంటి అనుకుంటున్నారా. బ్రహ్మాజీ ఫలానా హీరోయిన్ ఒకరు ఇద్దరి పేర్లు పెట్టి కాదు ముఖ్యంగా హీరోయిన్లు అందరి గురించి కామెంట్ చేశాడు. బ్రహ్మాజీ కామెంట్లో కూడా నిజం లేకపోలేదు. అసలు విషయానికొస్తే కరోనా కలవరం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.లాక్ డౌన్ నేపథ్యంలో అందరూ చాలా ఇబ్బందులు పడ్డారు. ఇందులో పేద వాళ్ళ పరిస్థితి మరీ దారుణం. దీంతో ప్రభుత్వ సహాయంతో ,పాటు సినిమా తారలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి పేదలకు సాయం చేస్తున్నారు.


 సినిమా ఇండస్ట్రీలో కూడా కిందిస్థాయి వర్కర్స్ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారికి నిత్యవసర సరుకులు పంపిణీ ఇతరత్రా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఏర్పడిన చారిటీ నే కరోనా క్రైసిస్. ఈ చారిటీ చిరంజీవి ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇప్పటివరకు ఇండస్ట్రీకి చెందిన నటులు దర్శకులు నిర్మాతలు ఇలా అన్ని రంగాల వాళ్ళు వారికి తోచిన విధంగా ఆర్థిక సహాయం చేశారు. ఒక హీరోయిన్లు మినహా, వాళ్ళలో కూడా లావణ్య త్రిపాఠి ప్రణీత లాంటి ఒకరిద్దరు ముందుకొచ్చి తనవంతు సాయం చేశారు.


 కానీ స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న ఏ ఒక్క హీరోయిన్ కూడా ఇప్పటివరకు ఉలుకు పలుకు లేదు. ఇదే విషయాన్ని ప్రస్తావించారు నటుడు బ్రహ్మాజీ. ముంబై కి చెందిన హీరోయిన్స్ ఇక్కడ స్టార్ హీరోయిన్ లుగా  ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరూ కార్మికులకు సహాయం చేయడానికి ముందుకు రాకపోవడం ఆశ్చర్యంగా ఉందని కామెంట్ చేశారు బ్రహ్మాజీ. బ్రహ్మ హత్య చేసిన కామెంట్లు అర్థం ఉంది అని కొందరు నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు. మరి హీరోలంతా సంపాదించాక పోయినా హీరోయిన్ల స్థాయిలో వాళ్ల రెమ్యూనరేషన్ బాగానే ఉన్నాయి. కానీ ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు మాత్రం ఒకరిద్దరు తప్ప హీరోయిన్స్ ముందుకు వచ్చినట్లుగా కనబడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: